పాములు పగబడతాయా? 500సార్లు పాముకాటుకు గురైన 45ఏళ్ల వ్యక్తి.. హాట్ టాపిక్‌గా మారిన అంశం!

ABN , First Publish Date - 2022-03-21T01:57:51+05:30 IST

పాములు పగబడతాయని.. టార్గెట్ చేస్తే చంపేవరకూ వదలవనే విషయాన్ని ఇప్పటి వరకు చాలా సినిమాల్లో చూశాం. అయితే శాస్త్రవేత్తలు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. ఇపుడు ఈ చర్చ ఎందుకు అనే విషయం

పాములు పగబడతాయా? 500సార్లు పాముకాటుకు గురైన 45ఏళ్ల వ్యక్తి.. హాట్ టాపిక్‌గా మారిన అంశం!

ఇంటర్నెట్ డెస్క్: పాములు పగబడతాయని.. టార్గెట్ చేస్తే చంపేవరకూ వదలవనే విషయాన్ని ఇప్పటి వరకు చాలా సినిమాల్లో చూశాం. అయితే శాస్త్రవేత్తలు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. ఇపుడు ఈ చర్చ ఎందుకు అనే విషయంలోకి వెళితే.. సాధారణంగా ఒక వ్యక్తి  ఒకటి, రెండు సార్లు పాము కాటుకు గురికావొచ్చు. కానీ మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఇప్పటి వరకూ ఏకంగా 500సార్లు పాముకాటుకు గురయ్యాడు. ప్రస్తుతం  ఈ అంశం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



లాతూర్ జిల్లాలోని అవుసా పట్టణానికి చెందిన అనిల్ తుకారాం గైక్వాడ్‌కు ప్రస్తుతం 45ఏళ్లు. ఆయన వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. పొలం పనులకు వెళ్లే క్రమంలో తరచూ ఈయన పాము కాటుకు గురవుతున్నాడు. ఈ నేపథ్యంలో గత 15ఏళ్లలో దాదాపు 500 సార్లు పాముకాటుకు గురయ్యాడు. పొలాల్లోకి వెళ్లినప్పుడే కాకుండా జనసమూహాల్లో ఉన్నపుడు కూడా చాలాసార్లు అనిల్ పాముకాటుకు గురయ్యాడట. ఈ క్రమంలో అనిల్ ఐసీయూ వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డ ఘటనలూ ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. సచ్ఛిదానంద్ అనే డాక్టర్ ఇప్పటి వరకు 150సార్లు అనిల్‌కు చికిత్స చేశాడు. కాగా.. ఒకే వ్యక్తి ఇన్నిసార్లు పాముకాటుకు గురికావడం పట్ల డాక్టర్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు.    




Updated Date - 2022-03-21T01:57:51+05:30 IST