Abn logo
Jul 15 2021 @ 10:26AM

పార్టీ నేతలకు అఖిలేష్ వ్యాక్సిన్ సలహా!

లక్నో: పార్టీ నేతలంతా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కోరారు. కరోనా నుంచి రక్షణకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని అఖిలేష్ తెలిపారు. కాగా కొంతకాలం క్రితం యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బీజేపీ వ్యాక్సిన్ తాను తీసుకోనని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కరోనా సెకెండ్ వేవ్ కల్లోలం చూసిన తరువాత అఖిలేష్ తన మాట మార్చారు. తాను శాస్త్రవేత్తల సలహాలను పాటిస్తానని అన్నారు. తనకు వైద్యులపై పూర్తి నమ్మకం ఉందని, అయితే బీజేపీ ప్రభుత్వంపై ఏమాత్రం నమ్మకం లేదని పేర్కొన్నారు. రాష్ఠ్ర ప్రజలు వ్యాక్సిన్‌పై నమ్మకం కలిగి ఉండాలని, యూపీ సీఎం యోగిపై నమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు.