సేవలకు సెల్యూట్‌!

ABN , First Publish Date - 2020-04-10T09:17:34+05:30 IST

సీకేదిన్నె మండలం పబ్బాపురం గ్రామానికి చెందిన రైతు ఈశ్వర్‌రెడ్డి భార్య రమాదేవి పెళ్లయిన 14 సంవత్సరాల తరువాత గర్భం దాల్చింది. అయితే ఏడో నెలలోనే ఆమెకు పురిటి

సేవలకు సెల్యూట్‌!

నెలలు నిండకముందే కవలల ప్రసవం

రిమ్స్‌లో చిన్నారులకు వెంటిలేటర్‌ కరువు

డయల్‌ 100కు బాధితుల ఫిర్యాదు

స్పందించిన ఎస్పీ అన్బురాజన్‌

ప్రైవేటు ఆసుపత్రిలో వెంటిలేటరుపై 

 చికిత్స అందిస్తున్న వైద్యులు


కడప (క్రైం), ఏప్రిల్‌ 9: సీకేదిన్నె మండలం పబ్బాపురం గ్రామానికి చెందిన రైతు ఈశ్వర్‌రెడ్డి భార్య రమాదేవి పెళ్లయిన 14 సంవత్సరాల తరువాత గర్భం దాల్చింది. అయితే ఏడో నెలలోనే ఆమెకు పురిటి నొప్పులు రావడంతో కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ సరైన వసతులు లేకపోవడంతో రిమ్స్‌కు తరలించారు. ఆమెకు ఇద్దరు మగపి ల్లలు పుట్టారు. నెలలు నిండకముందే పుట్టడంతో నవజాతశిశువులకు వెంటిలేటరుపై చికిత్స అందిం చాల్సి ఉంది. ఆ మేరకు రిమ్స్‌లో సౌకర్యాలు లేవు. కరోనా నేపధ్యంలో కడపలో ప్రైవేటు ఆసుపత్రు లు, డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో బాధి తులు డయల్‌ 100కు సమాచారమిచ్చారు. ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ స్పందించి ఆ కుటుంబానికి భరోసా కల్పించాలని కడప డీఎస్పీ సూర్యనారాయణ, వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణలను ఆదేశించారు.


దీంతో వారు ఎన్టీఆర్‌ సర్కిల్‌ సమీపంలోని చెన్నై చిన్న పిల్లల ఆసుపత్రి వైద్య బృందంతో చర్చించడంతో వారు నవజాత శిశువులకు వైద్యం అందిస్తామని చెప్పారు. కడప డీఎస్పీ సూర్యనారాయణ దగ్గరుండి పిల్లలను ప్రత్యేక అంబులెన్స్‌లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా చెన్నై చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌లో వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న నవజాత శిశువులను ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ పరిశీలించారు. ప్రజలు ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు.

Updated Date - 2020-04-10T09:17:34+05:30 IST