‘పాత పద్ధతిలోనే జీతాలు ఇవ్వాలి’

ABN , First Publish Date - 2022-01-29T04:47:04+05:30 IST

పాత పద్ధతిలోనే ఉద్యోగులకు జీతాలు పెండిం గ్‌ డీఏలతో కలిపి ఇవ్వాలని నందికొట్కూరు తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది, వీఆర్వోలు కలసి డిప్యూటీ తహసీల్దార్‌ పద్మావతికి వినతి పత్రం అందజేశారు.

‘పాత పద్ధతిలోనే జీతాలు ఇవ్వాలి’
జూపాడుబంగ్లాలో డీడీవోకు వినతిపత్రం అందజేస్తున్న ఉపాధ్యాయులు

నందికొట్కూరు రూరల్‌, జనవరి 28: పాత పద్ధతిలోనే ఉద్యోగులకు జీతాలు పెండింగ్‌ డీఏలతో కలిపి ఇవ్వాలని నందికొట్కూరు తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది, వీఆర్వోలు కలసి డిప్యూటీ తహసీల్దార్‌ పద్మావతికి వినతి పత్రం అందజేశారు. శుక్రవారం నందికొట్కూరు తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది, వీఆర్వో లు మాట్లాడుతూ ఉద్యోగులకు వేతనాలను పెండింగ్‌ డీఏలతో కలిపి ఇవ్వాలని కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలను చేయవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. 

కోవెలకుంట్ల: జనవరికి సంబంధించి వేత నాలను ప్రభుత్వం పాత పీఆర్సీ ప్రకారమే ఇవ్వాలని ఏపీటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఖాజా హుస్సేన్‌ కోరారు. శుక్రవారం కోవెలకుంట్ల ఎస్టీవో కార్యాలయంలో ఎస్టీవో సురేష్‌కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో వెంకటరా మిరెడ్డి, హరిప్రసాద్‌, రాజేశ్వర్‌రెడ్డి, శ్రీను, చాంద్‌బాషా పాల్గొన్నారు.  

జూపాడుబంగ్లా: ఉద్యోగులకు ప్రభుత్వం పాత జీతాన్నే ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు శుక్రవారం ఎమ్మార్సీలో డీడీవోకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం ఉద్యోగులతో చెలగాటమాడుతోందని, అర్థంకాని చేతకాని జీవోలను జారీ చేసి సతమతం చేయడం దారుణమని అన్నారు. ఉద్యోగులపై ప్రభుత్వం చేస్తున్న మొడివైఖరిని నిరసిస్తూ వినతిపత్రం అందజేశారు.

బనగానపల్లె: ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్‌సీ ప్రకారం జీతాలు ఇవ్వవద్దని, పాత పీఆర్‌సీ  ప్రకారమే జీతాలు ఇవ్వాలని పీఆర్‌సీ సాధన సమితి నాయకులు ఎంఈవో స్వరూపకు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. యూటీఎప్‌ జిల్లా కార్యదర్శి సత్యప్రకాశ్‌, మండల అధ్యక్షుడు ప్రతాప్‌, ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్య క్షుడు మాధవస్వామి, పీఆర్‌టీయూ నాయకులు బాలమద్దిలేటి, ఎస్టీయూ నాయకులు ఓబుళరెడ్డి, తదితరులు వినతిపత్రం సమర్పించారు. 

Updated Date - 2022-01-29T04:47:04+05:30 IST