గ్రీన్‌ అంబాసిడర్‌ జీతాల పేరిట సొమ్ము స్వాహా

ABN , First Publish Date - 2020-07-10T11:20:29+05:30 IST

గ్రీన్‌ అంబాసిడర్స్‌ జీతాలు దుర్వినియోగం చేసిన ఘటనపై అప్పటి పంచాయతీ కార్యదర్శిపై గురువారం విచారణ ప్రారంభమైంది.

గ్రీన్‌ అంబాసిడర్‌ జీతాల పేరిట సొమ్ము స్వాహా

శనివారపుపేట పంచాయతీలో అవకతకలు

ఏడాది తర్వాత ఏలూరు డీఆర్‌డీఏ పీడీ  విచారణ 


ఏలూరు రూరల్‌, జూలై 9 : గ్రీన్‌ అంబాసిడర్స్‌ జీతాలు దుర్వినియోగం చేసిన ఘటనపై అప్పటి పంచాయతీ కార్యదర్శిపై గురువారం విచారణ ప్రారంభమైంది. ఏలూరు డీఆర్‌డీఏ పీడీ ఉదయేశ్వరరావు బాధ్యులైన వారిపై విచారణ చేశారు. 2018-19 ఏడాదిలో శనివారపుపేట పంచాయ తీలో జరిగిన దానిపై ఏడాది తర్వాత ఆలస్యంగా విచారణ జరిగింది. 2018-19 ఏడాదిలో అప్పటి జిల్లా కలెక్టర్‌  గ్రామాల్లో రెండు వేల జనా భాకు పైగా ఉన్న ప్రాంతాల్లో గ్రీన్‌ అంబాసిడర్స్‌ పేరుతో జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో నియమించారు. ఏలూరు రూరల్‌ మండలం శని వారపుపేట పంచాయతీలో 11 మంది గ్రీన్‌ అంబాసిడర్స్‌ను నియమిం చా రు. వీరికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ద్వారా ప్రతి నెలా జీతం అందజే స్తోంది. అయితే 2018-19 ఏడాదిలో గ్రీన్‌ అంబాసిడర్స్‌కు సకాలంలో జీతాలు రాకపోవడంపై పంచాయతీ జనరల్‌ ఫండ్‌ నుంచి ఒక్కొక్కరికి ఆరు వేలు చొప్పున జీతాలు చెల్లించేలా ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇదే క్ర మంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ నుంచి జీతాలు వస్తే తిరిగి వాటిని పంచా యతీకి జమ చేసేలా ఒప్పంద పత్రాలు తీసుకుని జీతాలు చెల్లించారు. అయితే ఆ ఏడాదిలో గ్రీన్‌ అంబాసిడర్స్‌ చాలా మంది విధుల్లోకి రావడం మానేశారు. ఆ పంచాయతీలో సెక్రటరీగా అప్పట్లో  విధులు నిర్వహి స్తున్న తనూజ ఇద్దరు వలంటీర్లు, బయట వ్యక్తులను గ్రీన్‌ అంబాసి డర్లు గా చూపించారు.


అదే సమయంలో ఆమె బదిలీపై వేరే ప్రాంతం వెళ్లారు. పాత వారందరికీ బ్యాంకులో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ జీతాలు విడుదల చేసింది. ఆ విషయం తెలుసుకున్న ఆమె పాత గ్రీన్‌ అంబాసిడర్స్‌ దగ్గరకు వెళ్లి మీ జీతాలు నా సొంత అకౌంటు నుంచి ఇచ్చానని చెప్పి వారి అందరి దగ్గర నుంచి జీతాలు మొత్తం ఏడాదికి రూ.7.50 లక్షలు తీసుకుని  పంచా యతీకి జమ చేయలేదు. ఈ విషయం డీఎల్‌పీవో విచారణలో తేలడంతో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సెక్రటరీ తనూజ జీతాన్ని నిలుపుదల చేశారు. దీనిపై ఉదయం డీఆర్‌డీఏ ప్రాంగణంలో పీడీ ఉదయేశ్వరరావు అప్పటి సెక్రటరీ తనూజ, ప్రస్తుతం పని చేస్తున్న ఠాగూర్‌ను, ఇప్పటి వరకు గ్రీన్‌ అంబాసిడర్‌గా చలామణీ అయిన 11 మంది నకిలీ ఉద్యోగులను, ఏలూరు ఎంపీడీవో మనోజ్‌,  ఇప్పటి ఈవోపీ ఆర్డీ సరళకుమారి, అప్పటి డీఎల్‌పీవోలను విచారించారు. దీనిపై నివేది కను జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నట్టు ఆయన తెలిపారు. 

Updated Date - 2020-07-10T11:20:29+05:30 IST