పీఆర్‌సీ కమిషన్‌ ప్రతిపాదించినట్లుగా జీతాలు చెల్లించాలి

ABN , First Publish Date - 2021-06-24T04:57:10+05:30 IST

11వ పీఆర్‌సీ కమిషన్‌ సభ్యులు ప్రతిపాదించినట్లుగా జీవో నెం.60ని సవరించి వే తనాలు పెంచాలని కోరుతూ బుధవారం కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయం వద్ద కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు నిరసన తెలిపారు.

పీఆర్‌సీ కమిషన్‌ ప్రతిపాదించినట్లుగా జీతాలు చెల్లించాలి
మున్సిపల్‌ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న కార్మికులు

కామారెడ్డి టౌన్‌, జూన్‌ 23: 11వ పీఆర్‌సీ కమిషన్‌ సభ్యులు ప్రతిపాదించినట్లుగా జీవో నెం.60ని సవరించి వే తనాలు పెంచాలని కోరుతూ బుధవారం కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయం వద్ద కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు రాజనర్సు మాట్లాడుతూ 11వ పీఆర్‌సీ కమిషన్‌ చైర్మన్‌ బిస్వాల్‌  కేటగిరీల వారిగా ప్రతిపాదించినట్టుగా కాకుండా ప్రభుత్వం జీతాలు తగ్గించి తమకు అన్యాయం చేస్తుందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని పీఆర్‌సీలలో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికులకు మినిమం బేసిక్‌ పేనే కనీస వేతనంగా చెల్లించేవారని అన్నారు. స్వరాష్ట్రంలో గత సంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. వెంటనే తమకు జీవో నెం.60లో పేర్కొన్న వేతనాలను కేటగిరీల వారిగా 2021 జూన్‌ నెల నుంచి అమలు చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు, ఔట్‌ సోర్సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T04:57:10+05:30 IST