ఎ.కోడూరులో సచివాలయ సిబ్బందితో మాట్లాడుతున్న జేసీ
బండి ఆత్మకూరు, జూలై 1: విధుల పట్ల సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వీడాలని జేసీ నారపురెడ్డి మౌర్య సూచించారు. మండలంలోని ఎ.కోడూరు సచివాలయాన్ని శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా అటెండెన్స్, మూమెంట్ రిజిస్టర్లను ఆన్లైన్ దరఖాస్తుల వివరాలు రిశీలించారు. ప్రజలకు మరిన్ని సేవలు త్వరితగతిన అందించాలని ఆమె సూచించారు. సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్ ఉమారాణి, ఎంపీడీవో వాసుదేవగుప్త పాల్గొన్నారు.