కార్మికుల బాగోగుల బాధ్యత యాజమాన్యాలదే..

ABN , First Publish Date - 2020-03-30T09:43:22+05:30 IST

కరోనా మహమ్మారి కార్మికుల దరి చేరకుండా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని, ఇటుకబట్టీల యజమానులు కూడా కార్మికులకు భోజన వసతితో పాటు సదుపాయాలను కల్పించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి సూచించారు.

కార్మికుల బాగోగుల బాధ్యత యాజమాన్యాలదే..

విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి 



మహేశ్వరం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి కార్మికుల దరి చేరకుండా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని, ఇటుకబట్టీల యజమానులు కూడా కార్మికులకు భోజన వసతితో పాటు సదుపాయాలను కల్పించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి సూచించారు.


ఆదివారం తుక్కుగూడ మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ చైర్మన్‌ కాంటేకార్‌ మదుమోహన్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇటుకబట్టీల యజమానులతో కరోనా కట్టడిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ తుక్కుగూడ ము న్సిపల్‌ పరిధిలో ఉన్న అనేక ఇటుకబట్టీల్లో దాదాపుగా రెండు వేలకు పైగా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వలస కార్మికులు ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపల్‌ చైర్మన్‌ కాంటేకార్‌ మధుమోహన్‌, వైస్‌ చైర్మన్‌ భవానీ వెంకట్‌రెడ్డితో పాటు పలువురు కౌన్సిలర్లు, కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌, తహసీల్దార్‌ ఆర్‌పీ.జ్యోతి, ఇటుకబట్టీల యజమానులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-30T09:43:22+05:30 IST