శబరిమలలో ఆంక్షలు.. భక్తులకు కీలక సూచనలు...

ABN , First Publish Date - 2020-09-22T17:10:02+05:30 IST

మండల పూజలకు, మకరజ్యోతి దర్శనానికి వచ్చే భక్తులు శబరిమల సన్నిధానంలో బస చేసేందుకు అనుమతి లేదని దేవస్థానం బోర్డు పేర్కొంది. కరోనా వైరస్‌ కారణంగా మార్చి నుంచి

శబరిమలలో ఆంక్షలు.. భక్తులకు కీలక సూచనలు...

చెన్నై : మండల పూజలకు, మకరజ్యోతి దర్శనానికి వచ్చే భక్తులు శబరిమల సన్నిధానంలో బస చేసేందుకు అనుమతి లేదని దేవస్థానం బోర్డు పేర్కొంది. కరోనా వైరస్‌ కారణంగా మార్చి నుంచి శబరిమల అయ్యప్ప ఆలయాన్ని మూసివేశారు. నవంబరులో జరిగే  మండల పూజల కోసం ఆలయాన్ని తెరవనున్నారు. ఇందుకుగాను ముందస్తు ఏర్పాట్లను దేవస్థానం బోర్డు చేపట్టింది. శబరిమలకు వచ్చే భక్తులకు నీలకల్‌ ప్రాంతంలో కరోనా పరీక్షలు నిర్వహించి, రోజుకు 5వేల మందిని మాత్రమే అనుమతించాలని నిర్ణయించింది. 18 మెట్ల వద్ద పోలీసులు ఉండరు. భక్తులు తమకు తామే ఎక్కి వెళ్లాలని దేవస్థానం బోర్డు పేర్కొనింది. తమి ళనాడు, కర్ణాటక, ఆంధ్ర నుంచి వచ్చే భక్తులు కొన్ని రోజులు సన్నిధానంలో బస చేసి వెళ్తుంటారు. అయితే ఈ ఏడాది బసకు అనుమతి లేదని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-09-22T17:10:02+05:30 IST