ఏపీఎల్‌ను యువ క్రికెటర్లు సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-07-02T05:20:37+05:30 IST

ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌తో ఎక్కువ మంది యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్దార్ధరెడి అన్నారు.

ఏపీఎల్‌ను యువ క్రికెటర్లు సద్వినియోగం చేసుకోవాలి
జెర్సీలను ఆవిష్కరిస్తున్న శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్దరెడ్డి, లేళ్ళ అప్పిరెడ్డి, బూచేపల్లి శివప్రసాదరెడ్డి తదితరులు

శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్దరెడి

గుంటూరు(క్రీడలు), జూలై 1: ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌తో ఎక్కువ మంది యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్దార్ధరెడి అన్నారు. విద్యానగర్‌లోని వెల్‌కమ్‌ హోటల్లో శుక్రవారం కోస్టల్‌ రైడర్స్‌ జట్టు వెబ్‌సైట్‌, జెర్సీలను ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, జట్టు స్పాన్సర్‌ బూచేపల్లి శివప్రసాదుతో కలసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిద్ధార్దరెడ్డి మాట్లాడుతూ లీగ్స్‌ ప్రాబల్యం బాగా పెరిగిందని, యువ ఆటగాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం మరింతగా కృషి చేస్తుందన్నారు.  జట్టు స్పాన్సర్‌, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ నైపుణ్యం కలిగిన క్రీడాకారులను వెలికి తీసేందుకు జట్టును స్పాన్సర్‌ చేస్తున్నట్టు పేర్కోన్నారు. కార్యక్రమంలో జట్టు స్పాన్సర్లు ఉదయ్‌ హస్పిటల్స్‌ ఎండి డాక్టర్‌ ఎమ్‌ రామకృష్ణారెడ్డి, బాలినేని ప్రణీత్‌రెడ్డి, జట్టు కోచ్‌ టి విజయ్‌కుమార్‌, అసిస్టెంట్‌ కోచ్‌ జి శంకరరావు, జట్టు కెప్టెన్‌ సి ఆర్‌ జ్ఞానేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-02T05:20:37+05:30 IST