రైతులను ఇబ్బంది పెట్టొద్దు

ABN , First Publish Date - 2021-12-01T06:50:22+05:30 IST

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

రైతులను ఇబ్బంది పెట్టొద్దు
కోలవెన్ను ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని పరిశీలిస్తున్న కమిషనర్‌ గిరిజాశంకర్‌

కోలవెన్నులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన పౌర సరఫరాల శాఖ రాష్ట్ర కమిషనర్‌ గిరిజాశంకర్‌

కోలవెన్ను (కంకిపాడు), నవంబరు 30 : ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలులో రైతులను ఎటువంటి ఇబ్బందులు పెట్టొద్దని  పౌర సరఫరాల శాఖ రాష్ట్ర కమిషనర్‌ గిరిజాశంకర్‌ అన్నారు.మండలంలోని కోలవెన్నులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి,  రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సదర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసేందుకు రైతు భరోసా కేంద్రాల వారీగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. మిల్లుల వద్ద ఎటువంటి ఇబ్బంది లేకుండా  కో ఆర్డినే టర్‌ను ఏర్పాటు  చేసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వ మార్గ దర్శకాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఏర్పాటు చేయాలని సూచించారు. మద్దతు ధరకంటే తక్కువగా అమ్ముకోవాల్సిన అవసరం లేదని రైతులకు అధికారులు నమ్మకం కల్పించాల న్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్‌ ఫ్రీ నెం 1902, 155251కు కాల్‌ చేయాలని సూచిం చారు. కార్యక్రమంలో పౌరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్‌, జేసీ మాధవీలత, తహసీల్దార్‌ టి.వి.సతీష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-01T06:50:22+05:30 IST