నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-11-30T07:02:43+05:30 IST

రాష్ట్రాన్ని వణికించి అతలాకుతలం చేసిన నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని అరకు పార్లమెంటరీ టీడీపీ మహిళా అధ్యక్షురాలు, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి డిమాండ్‌ చేశారు.

నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి

 మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి

రాజవొమ్మంగి, నవంబరు 29: రాష్ట్రాన్ని వణికించి అతలాకుతలం చేసిన నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని అరకు పార్లమెంటరీ టీడీపీ మహిళా అధ్యక్షురాలు, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి డిమాండ్‌ చేశారు. రాజవొమ్మంగి మండలంలో ఆదివా రం చెరుకుంపాలెం, సంజీవనగరం, దూసరపాము తదితర గ్రామాల్లో నష్టపోయిన పంటలను మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేతలు పరిశీలించారు. దాదాపుగా 150 ఎకరాలను పరిశీలించగా రైతుకు గింజకూడా చేతికి వచ్చే పరిస్థితిలేక ఇంకా నీటిలో తేలుతున్నాయన్నారు. ఇప్పటికే రైతులు ఎకరానికి రూ.35వేలు పెట్టిన పెట్టుబడిని నష్ట పరిహరంగా ప్రభుత్వం అందజేసి రైతన్నను ఆదుకోవాలన్నారు. ప్రజా సంకల్పయాత్రతో ఆర్భాటాలు చేస్తున్న వైసీపీ నేతలు, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు నేడు ఏమైపోయారని ప్రశ్నించారు. ప్రభు త్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను అట్టహసంగా ప్రారంభించి నేడు రైతుల నుంచి ఒక్క గింజ ధాన్యం కొనకుండా అధికారులు, ప్రభుత్వం ముఖం చాటేసి రైతులను దగా చేస్తుందన్నారు. పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి దంతులూరి శివరామచంద్రరాజు మాట్లాడుతూ అతివృష్టితో వరితోపాటు మెట్ట పంటలైన మినుములు, పత్తి, పొగాకు వంటివి చేతికందలేదన్నారు. వీటి నష్టాలను అంచనాలు వేసేందుకు ఏ ఒక్క అధికారి కనీసం రైతులను పలకరించిన పరిస్థితి లేకపోవడం సిగ్గు చేటన్నారు. ఏడాదికి పింఛన్‌ రూ.250లు పెంచుతూ ఉంటామన్న ఎన్నికల హామీ ఏమైందన్నారు. రేషన్‌, పింఛన్ల విచారణ పేరుతో 5లక్షల వరకు అర్హులను తొలగించేందుకు దొడ్డిదారిన సన్నాహాలు చేస్తుందని విమర్శించారు. ప్రధాన రోడ్లుతోపాటు గ్రామాల రహదారులు ఛిద్ర మైన పట్టనట్లు ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గొల్లపూడి పెద్దిరాజు, లోతా లక్ష్మణరావు, సింగం శ్రీకాంత్‌, నాగేశ్వర్రావు, పెదిరెడ్ల సత్తిబాబు, ముప్పన మోహన్‌, మరిశే శ్రీను, మఠం విజయ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.


తడిసిన ధాన్యాన్ని పరిశీలించలేదు

మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

పెదపూడి, నవంబరు 29: తడిసిన ఽధాన్యం పొలా ల్లోనే ఉండి రైతులు ఇబ్బందిపడుతున్నా అధికా రులు, నాయకులు కనీసం పరిశీలించలేదని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. సంపర, కాండ్రేగుల గ్రామాల్లో పంట నష్టపోయిన రైతులను ఆదివారం పరామర్శించారు. నివర్‌ తుపాను కారణంగా నష్టపో యిన రైతులను ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకోవా లని డిమాండ్‌ చేశారు.  ఈ సందర్భంగా మాట్లాడు తూ  రూపాయి చెల్లిస్తే ఇన్సూరెన్సు ఇస్తా మన్న మాటలు గాలిమాటలేనా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీడీపీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి మూకల శ్రీరాములు, మాజీ ఎంపీపీ జుత్తుగ సూర్యకుమారి, టీడీపీ మండల అధ్యక్షుడు జుత్తుగ కృష్ణ, మండల సర్పంచ్‌ల సమాఖ్య మాజీ అధ్యక్షుడు తిబిరిశెట్టి దొరబాబు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్‌ కరకుదురు దత్తుడు, బీసీ విభాగం నాయకుడు పలివెల బుజ్జి తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2020-11-30T07:02:43+05:30 IST