నాగులపల్లిలో పర్యటించిన ఆర్‌డబ్య్లూఎస్‌ అధికారి

ABN , First Publish Date - 2022-05-25T05:09:45+05:30 IST

తూప్రాన్‌మండలం నాగులపల్లిలో కలుషిత నీరు సరఫరా అవుతున్నట్లు మంగళవారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్తకు సంబంధిత అధికారులు స్పందించారు.

నాగులపల్లిలో పర్యటించిన ఆర్‌డబ్య్లూఎస్‌ అధికారి

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

తూప్రాన్‌రూరల్‌, మే 24: తూప్రాన్‌మండలం నాగులపల్లిలో కలుషిత నీరు సరఫరా అవుతున్నట్లు మంగళవారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్తకు సంబంధిత అధికారులు స్పందించారు. గ్రామీణ తాగునీటి సరఫరా విబాగం ఏఈ ప్రవీణ్‌కుమార్‌, సర్పంచు భగవాన్‌రెడ్డితో కలిసి నాగులపల్లిలో పర్యటించిరు. తాగునీటి సరఫరా పైపులైన్లు, నల్లాలను, వాటర్‌ట్యాంకును, వాటర్‌ప్లాంటు పరిిస్థితిని పరిశీలించారు. వాటర్‌ ట్యాంకు శుభ్రంగానే ఉందని తెలిపారు. ఎక్కడైనా వాటర్‌ లీకేజీలుంటే సరిచేయాలని ఆయన వాటర్‌మ్యాన్‌కు, పంచాయతీ కార్యదర్శికి సూచించారు. ప్లాంటుకు సరఫరా అవుతున్న తాగునీటి శాంపిళ్లను సేకరించారు. పరీక్ష నిమిత్తం నీటిని ల్యాబ్‌కు పంపనున్నట్లు ఏఈ చెప్పారు. వచ్చే వానాకాలంలో జాగ్రత్తలు పాటించాలని, ఎక్కడకూడ నీరు కలుషితం కాకుండా చూసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి ఏఈ సూచించారు.

Updated Date - 2022-05-25T05:09:45+05:30 IST