యాడికి పోలీస్స్టేషనలో ఉంచిన సీజ్ చేసిన బైక్లు
యాడికి, జూన 26 : వివిధ కేసుల్లో యాడికి పోలీస్స్టేషన పరిధిలో పట్టుబడిన సుమారు వంద బైక్లు తప్పు పడుతున్నా.. వాటిని వేలం వేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఆ బైక్ల రక్షణ పోలీసులకు భారంగా మారుతోంది. కరోనా సమయంలో, నాటుసారా రవాణా కేసుల్లో సీజ్ చేసిన ద్విచక్రవాహనాలను పోలీస్స్టేషన ఆవరణంలో ఉంచడంతో ఆ ప్రాంతం మొత్తం వాటితో నిండిపోయింది. ఇక కొత్తగా వాహనాలు తెస్తే ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితి నెలకొంది.