Abn logo
Dec 4 2020 @ 13:56PM

వైరల్ అవుతున్న మిలియనీర్ చర్య.. దండిగా డబ్బు ఉండటంతో..

ఇంటర్నెట్ డెస్క్: దండీగా డబ్బుంటే.. ఏదైనా చేయచ్చని మరోసారి నిరూపించాడో రష్యన్ మిలియనీర్. జస్ట్.. 49 పౌండ్ల ఖరీదు చేసే బర్గర్ తినేందుకు అతడు ఏకంగా 2000 పౌండ్లు ఖర్చు చేశాడు. ఎందుకంత ఖర్చు..అంటారా..? పూర్తి విషయం తెలియాలంటే మన మిలియనీర్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి. ముప్ఫై మూడేళ్ల విక్టర్ మార్టినోవ్..మాస్కోలోని ఓ కంపెనీకి సీఈఓ. ఇటీవల క్రిమియా ప్రాంతానికి సమీపంలోని ఓ దీవికి తన గర్ల్‌ఫ్రెండ్‌తో జాలీగా ఎంజాయ్‌ చేసేందుకు వెళ్లాడు. అయితే..అక్కడి వారికి ఆర్గానిక్ ఆహారం తినీ తినీ తెగ బోర్ కొట్టేసింది. 

మరి తెగ డబ్బున్నోడు కదా... అందుకే తన అవసరం తీర్చే ఖరీదైన ఐడియాను క్షణాల్లో అమలు చేశాడు. ఆ దీవి నుంచి ఏకంగా 750 కీమీల దూరంలో ఉన్న మెక్‌డోనల్డ్ షాపుకు వెళ్లేందుకు ఏకంగా హెలికాఫ్టర్‌నే అద్దెకు తీసుకున్నాడు. రానూపోను జర్నికి ఏకంగా 2 వేల పౌండ్లు చెల్లించాడు. అదేంటీ.. సమీపంలోనే ఉన్న క్రిమియాలో మెక్‌డోనాల్డ్స్ లేవా అంటే..ఒకప్పుడు ఉండేవి. ఈ ప్రాంతాన్ని రష్యా 2014లో తన భూభాగంలో కలిపేసుకోవడంతో మెక్‌డోనల్డ్స్ తన కార్యకలాపాలకు బ్రేక్ చెప్పింది. కాగా.. తాను ఎందుకు అలా చేసేందీ వివరిస్తూ మలియనీర్ రూపొందించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

Advertisement
Advertisement