కరోనా లాక్‌డౌన్: రష్యా డ్యాన్సర్ల తీరుకు నెటిజన్లు ఫిదా..

ABN , First Publish Date - 2020-04-10T03:25:00+05:30 IST

ప్రస్తుతం ప్రపంచమంతా ఇంటికే పరిమితమవుతోంది. అందుకు గల కారణం కరోనా ప్రేరేపిత లాక్ డౌన్లన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఇంట్లో ఉంటే వంట పనో ఇంటి పనో చేయకతప్పదు. మరి రోజూ అవే పనులు చేస్తూ ఉంటే బోరు కొడుతుంది కదా. దీనికి తోడూ డ్యాన్సర్ల వంటి వారైతే ప్రాక్టీస్ తక్కువై తమ నైపుణ్యాలు కూడా కోల్పోతారు. ఇటువంటి వారి కోసం రష్యన్ డ్యాన్సర్లు కొత్త టెక్నిక్‌ను పరిచయం చేస్తున్నారు.

కరోనా లాక్‌డౌన్: రష్యా డ్యాన్సర్ల తీరుకు నెటిజన్లు ఫిదా..

మాస్కో: ప్రస్తుతం ప్రపంచమంతా ఇంటికే పరిమితమవుతోంది. అందుకు గల కారణం కరోనా ప్రేరేపిత లాక్ డౌన్లన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఇంట్లో ఉంటే వంట పనో ఇంటి పనో చేయకతప్పదు. మరి రోజూ అవే పనులు చేస్తూ ఉంటే బోరు కొడుతుంది కదా. దీనికి తోడూ డ్యాన్సర్ల వంటి వారైతే ప్రాక్టీస్ తక్కువై తమ నైపుణ్యాలు కూడా కోల్పోతారు. ఇటువంటి వారి కోసం రష్యన్ డ్యాన్సర్లు కొత్త టెక్నిక్‌ను పరిచయం చేస్తున్నారు.  సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో మిఖాయిలోవస్కీ థియటర్‌కు చెందిన కొందరు బాలే డ్యాన్సర్లు వంటా వార్పుల్లాంటి రోజువారి పనుల్లో కూడా డ్యాన్స్ చేస్తూ తమ ఫిట్‌నెస్‌ను ఎలా నిలబెట్టుకోవాలో చూపించారు. గిన్నెలు, తువాళ్లు వంటి వాటితో వారు స్టెప్పులేసి దుమ్ములేపారు. ‘మా డ్యాన్సర్లు ఇంట్లో ఉంటూ కూడా ఎలా ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారో చూడండి’ అంటూ డ్యాన్సర్ల ప్రయత్నాల్ని మిఖాయిలోవస్కీ థియటర్‌ ఫేస్‌బుక్ ద్వారా పంచుకుంది. ‘బాలే అట్ హోమ్’  పేరుతో వారు చేసిన ప్రయత్నం ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. మీరు ఓ లుక్కేయండి.

                         వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2020-04-10T03:25:00+05:30 IST