Russian వాయుసేన దాడులు...ఐదార్ నేషనలిస్ట్ బెటాలియన్ కమాండ్ ధ్వంసం

ABN , First Publish Date - 2022-03-05T15:04:13+05:30 IST

ఉక్రెయిన్‌పై దాడిలో భాగంగా శనివారం రష్యా వాయుసేన దళాలు జరిపిన దాడుల్లో ఐదార్ నేషనలిస్ట్ బెటాలియన్ కమాండ్‌ను ధ్వంసం చేశాయి...

Russian వాయుసేన దాడులు...ఐదార్ నేషనలిస్ట్ బెటాలియన్ కమాండ్ ధ్వంసం

మాస్కో: ఉక్రెయిన్‌పై దాడిలో భాగంగా శనివారం రష్యా వాయుసేన దళాలు జరిపిన దాడుల్లో ఐదార్ నేషనలిస్ట్ బెటాలియన్ కమాండ్‌ను ధ్వంసం చేశాయి.  డొనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్‌లోని ఐదార్ నేషనలిస్ట్ బెటాలియన్ కమాండ్, అబ్జర్వేషన్ పోస్ట్‌ను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.రష్యా వాయుసేన ఓరియన్ డ్రోన్ 250 కిలోల బరువుగల పేలుడు పదార్థాలతో కూడిన క్షిపణిని ప్రయోగించింది.డ్రోన్ స్ట్రైక్ ద్వారా ధ్వంసమైన 'ఐదార్' బెటాలియన్ వీడియోను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.‘‘డొనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ భూభాగంలో రష్యన్ ఏరోస్పేస్ ఫోర్సెస్‌కు చెందిన ఇనోఖోడెట్స్ మానవరహిత వైమానిక విమానం ఐదార్ బెటాలియన్ యొక్క కమాండ్, అబ్జర్వేషన్ పోస్ట్‌ను ధ్వంసం చేసింది. గైడెడ్ ఎయిర్-లాంచ్ ప్రొజెక్టైల్ ద్వారా సైట్ ను నాశనం చేసింది’’అని రష్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.


Updated Date - 2022-03-05T15:04:13+05:30 IST