Russia-Ukraine War: తన Nobel Prizeను వేలం వేస్తున్న రష్యా జర్నలిస్ట్.. ఆ డబ్బులతో అతను ఏం చేస్తాడంటే..

ABN , First Publish Date - 2022-06-18T00:49:47+05:30 IST

రష్యా, ఉక్రెయిన్ మధ్య ప్రారంభమైన యుద్ధం నెలల తరబడి విరామం లేకుండా కొనసాగుతూనే ఉంది.

Russia-Ukraine War: తన Nobel Prizeను వేలం వేస్తున్న రష్యా జర్నలిస్ట్.. ఆ డబ్బులతో అతను ఏం చేస్తాడంటే..

రష్యా, ఉక్రెయిన్ మధ్య ప్రారంభమైన యుద్ధం నెలల తరబడి విరామం లేకుండా కొనసాగుతూనే ఉంది. ఆమెరికా, యూరప్ దేశాల మద్దతుతో రష్యాను ఉక్రెయిన్ సైన్యం నిలువరిస్తోంది. ఇంత సుదీర్ఘ కాలం యుద్ధం కొనసాగుతుండడంతో ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ యుద్ధంలో చాలా దేశాలు ఉక్రెయిన్‌కే మద్ధతుగా నిలుస్తున్నాయి. ఉక్రెయిన్‌కు తమకు వీలైనంత సహాయం చేస్తున్నాయి. అలాగే రష్యాపై అనేక రకాల ఆంక్షలు విధిస్తున్నాయి. కాగా, రష్యా దురాక్రమణ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు చెందిన చాలా మంది ప్రజలు ప్రాణ భయంతో పక్కదేశాలకు పారిపోయి తలదాచుకుంటున్నారు. 


ఇది కూడా చదవండి..

రోడ్డుపై అడుక్కుంటున్న పిల్లలు.. బిస్కెట్ ప్యాకెట్‌కు బదులు పొరపాటున 10 తులాల బంగారం ఉన్న బ్యాగ్‌ను ఇచ్చిందో మహిళ.. చివరకు..


ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఇతర దేశాల ప్రజలే కాదు.. కొందరు రష్యన్లు కూడా ఖండిస్తున్నారు. ఉక్రెయిన్లకు సోషల్ మీడియా ద్వారా మద్దతు పలుకుతున్నారు. తాజాగా, రష్యన్ జర్నలిస్టు దిమిత్రి మురటోవ్.. ఉక్రెయిన్ శరాణార్థులకు అండగా నిలబడేందుకు ముందుకొచ్చాడు. గతంలో తను అందుకున్న నోబెల్ బహుమతిని వేలానికి పెట్టాడు. రష్యా దాడికి భయపడి దాదాపు 35 లక్షల మంది ఉక్రెయిన్‌ ప్రజలు వివిధ దేశాలలో శరణార్థులుగా కాలం వెళ్లదీస్తున్నారు.  వారికి సహయం చేసేందుకు దిమిత్రి తన నోబెల్‌ ప్రైజ్‌ను వేలం వేయనున్నట్లు ప్రకటించారు. వేలం వేయగా వచ్చిన మొత్తాన్ని శరణార్థులకు సదుపాయాలు కల్పించడానికి వినియోగిస్తానని వెల్లడించారు.


ప్రముఖ రష్యన్ దినపత్రిక నోవయా గెజెటాకు దిమిత్రి మురటోవ్ ఎడిటర్. జర్నలిజంలో ఈయన చేసిన విశేషమైన కృషికి గానూ నోబెల్ వరించింది. గత ఏడాది ఫిలిప్పైన్స్‌కు చెందిన మారియా రెసాతో కలిసి సంయుక్తంగా మురటోవ్ నోబెల్‌ శాంతి బహుమతిని అందుకున్నారు. కాగా, ముందు నుంచి ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను మురటోవ్‌ ఖండిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం రష్యా ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో ప్రభుత్వ అనుకూల పత్రికలు మాత్రమే పనిచేస్తున్నాయని, తన వేలం ఈవెంట్‌ను తమ పత్రికలో ప్రచురించలేకపోవచ్చని దిమిత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2022-06-18T00:49:47+05:30 IST