Ukraine దేశంలోని 5 నగరాల్లో రష్యా కాల్పుల విరమణ
ABN , First Publish Date - 2022-03-08T15:35:32+05:30 IST
రష్యా మంగళవారం ఉదయం 10 గంటల నుంచి కాల్పుల విరమణ ప్రకటించింది....
మాస్కో(రష్యా): రష్యా మంగళవారం ఉదయం 10 గంటల నుంచి కాల్పుల విరమణ ప్రకటించింది. ఉక్రెయిన్ దేశంలోని కైవ్, చెర్నిహివ్, సుమీ, ఖార్కివ్, మారియుపోల్ నగరాల్లో మాస్కో కాలమానం ప్రకారం మంగళవారం 10 గంటల నుంచి కాల్పుల విరమణ ప్రకటిస్తున్నట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.సోమవారం బెలారస్లో రష్యా, ఉక్రెయిన్ దేశాల ప్రతినిధుల మధ్య జరిగిన మూడవ రౌండ్ చర్చల్లో పౌరుల తరలింపు సమస్యలు ప్రస్థావనకు వచ్చాయి.పౌరుల తరలింపు కోసం కైవ్, చెర్నిహివ్, సుమీ, ఖార్కివ్, మారియుపోల్ నగరాల్లో విరామం ఇస్తున్నట్లు రష్యా వివరించింది.కాగా తాను రష్యాతో మార్చి 10వతేదీన సమావేశం కాబోతున్నట్లు ఉక్రేనియన్ విదేశాంగ శాఖ మంత్రి డిమిట్రో కులేబా చెప్పారు.