‘స్పుత్నిక్‌ లైట్‌’ సింగిల్‌ డోసు టీకాకు పచ్చజెండా

ABN , First Publish Date - 2021-05-07T08:01:42+05:30 IST

రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి టీకా సింగిల్‌ డోసు వర్షన్‌ కూడా వస్తోంది. ‘స్పుత్నిక్‌ లైట్‌’ పేరిట పిలుస్తున్న ఈ వ్యాక్సిన్‌ వినియోగానికి రష్యా ఆరోగ్యశాఖ పచ్చజెండా ఊపింది...

‘స్పుత్నిక్‌ లైట్‌’ సింగిల్‌ డోసు టీకాకు పచ్చజెండా

మాస్కో, మే 6 : రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి టీకా సింగిల్‌ డోసు వర్షన్‌ కూడా వస్తోంది. ‘స్పుత్నిక్‌ లైట్‌’ పేరిట పిలుస్తున్న ఈ వ్యాక్సిన్‌ వినియోగానికి రష్యా ఆరోగ్యశాఖ పచ్చజెండా ఊపింది. ఈవిషయాన్ని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. తాము అభివృద్ధిచేసిన రెండు డోసుల స్పుత్నిక్‌-వి టీకా 91.6 శాతం ప్రభావశీలతను చూపగా, సింగిల్‌ డోసు వర్షన్‌ ‘స్పుత్నిక్‌ లైట్‌’ 79.4 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని వెల్లడించింది. 2020 డిసెంబరు 5 నుంచి 2021 ఏప్రిల్‌ 15 మధ్యకాలంలో సింగిల్‌ డోసు టీకా తీసుకున్న వలంటీర్లలో.. 28 రోజుల తర్వాత కలిగిన రోగ నిరోధక ప్రతిస్పందనల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చినట్లు పేర్కొంది. 


Updated Date - 2021-05-07T08:01:42+05:30 IST