అధికార పార్టీ నాయకులా... మజాకా..!

ABN , First Publish Date - 2022-01-22T05:39:49+05:30 IST

వారు ఏ మాత్రం ప్రజాప్రతినిధులు కాదు...కేవలం అధికార వైసీపీకి చెందిన నాయకులు మాత్రమే.. అలాం టివారు ఏకంగా ఓ బాలికా విద్యాలయంలో ఓ మండల మహిళా ప్ర జాప్రతినిధితో కలిసి తమ అధికార దర్పాన్ని ప్రదర్శించారు.

అధికార పార్టీ నాయకులా... మజాకా..!
కేజీబీవీలో బాలికలతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తున్న ఎంపీపీ, వైసీపీ నాయకులు


- కేజీబీవీలో బాలికలతో కలిసి మధ్యాహ్న భోజనం 

- వారి తీరుపై సర్వత్రా విమర్శలు

చెన్నేకొత్తపల్లి, జనవరి 21: వారు ఏ మాత్రం ప్రజాప్రతినిధులు కాదు...కేవలం అధికార వైసీపీకి చెందిన నాయకులు మాత్రమే.. అలాం టివారు ఏకంగా ఓ బాలికా విద్యాలయంలో ఓ మండల  మహిళా ప్ర జాప్రతినిధితో కలిసి తమ అధికార దర్పాన్ని ప్రదర్శించారు. వారిని వా రించే సాహసం చేయలేక బిత్తరపోవడం పాఠశాల సిబ్బంది వంతైంది. వివరాల మేరకు...స్థానిక కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని శుక్ర వారం ఎంపీపీ శ్రీశైలం ప్రవీణ సందర్శించారు. ఈ సందర్భంగా తరగ తులు, మధ్యాహ్న భోజనం నిర్వహణపై తనిఖీ చేసి ఆమె సిబ్బందితో సమావేశాన్ని  నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో బాలికలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అయితే ఎంపీపీతో పాటు అక్కడ ఈ కార్యక్రమాల్లో వైసీపీ నాయకులు పాల్గొనడం పలు విమర్శలకు తావిస్తోంది. ఎంపీపీ భర్త అయిన వైసీపీ నాయకుడు రమణతో పాటు మరికొందరు నాయకులు కేజీబీవీలో ప్రజాప్రతినిధితో కలిసి కార్యక్ర మాల్లో పాల్గొనడం ఏమిటని విద్యార్థుల తల్లి దండ్రులు ప్రశ్నిస్తున్నారు. మండల ప్రజాప్రతినిధి హోదాలో ఎంపీపీ విజిట్‌ చేయవచ్చుకానీ వైసీ పీ నాయకులు ఏ హోదాలో బాలికల పాఠశాలలోకి వెళ్లారని నిలదీస్తు న్నారు. అది కూడా ఏకంగా బాలికలతో కలిసి మద్యాహ్న భోజనం చే యడం ఎంతవరకు సమంజసని అసహనం వ్యక్తం చేశారు. ఎంత అధికార పార్టీకి చెందిన వారైతేనేమి... బాలికల పాఠశాల అని లేకుండా అక్కడికి వెళ్లి తమ పెత్తనం చెలాయించడం మండల వ్యాప్తంగా చ ర్చనీయాంశమైంది. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న వేళ నిబఽంధనలను మరచి కొందరు నాయకులు వ్యవహరిస్తున్న తీరుపట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వారించలేక పోయాం : సువర్ణ, ఎస్‌ఓ, కేజీబీవీ

ఎంపీపీ శుక్రవారం కేజీబీవీని సందర్శించారు. ఆమెతో పాటు మరి కొందరు వచ్చారు. బాలికలతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసిన మా ట వాస్తవమే. అయితే భోజనం సమయం హడావుడిలో వారిని వారిం చలేకపోయాం. మరో సారి ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.

Updated Date - 2022-01-22T05:39:49+05:30 IST