ఆర్‌జీయూకేటీ సెట్‌కు ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2020-12-05T06:22:59+05:30 IST

నేడు రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ (ఆర్‌జీయూకేటీ) ఆరేళ్ల కోర్సుకుగాను నిర్వహించే ప్రవేశపరీక్షకు కడియం పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈవో వి.లజపతిరాయ్‌ తెలిపారు.

ఆర్‌జీయూకేటీ సెట్‌కు ఏర్పాట్లు పూర్తి

కడియం, డిసెంబరు 4: నేడు రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్‌  నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ (ఆర్‌జీయూకేటీ) ఆరేళ్ల కోర్సుకుగాను నిర్వహించే ప్రవేశపరీక్షకు కడియం పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈవో వి.లజపతిరాయ్‌ తెలిపారు.  కడియం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పరీక్షాకేంద్రంలో 156 మంది ప్రవేశపరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. కొవిడ్‌-19 దృష్ట్యా నిబంధనలకు అనుగుణంగా ఒక్కో గదికి 16మంది విద్యార్థులు పరీక్షరాసే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. గదుల శానిటేషన్‌తో పాటు మెడికల్‌, టాయిలెట్స్‌, మంచినీరు, వెంటిలేషన్‌, సదుపాయాలు కల్పించామన్నారు. సీఎస్‌గా పల్లి రాజు, డీవోగా ఈవీవీ సుబ్బారావు, పదిమంది ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని విద్యార్థులు 9 గంటలకు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. 



Updated Date - 2020-12-05T06:22:59+05:30 IST