ఆర్టీసీ వర్సెస్‌ పంచాయతీ

ABN , First Publish Date - 2021-06-25T06:51:40+05:30 IST

స్థానికంగా ఆర్టీసీ, పంచాయతీ అధికారుల మధ్య స్థల వి వాదం తీవ్ర రూపం దాల్చింది. ఒకే స్థలానికి సంబంధించి ఇరుశాఖల అధికారులు కాంప్లెక్స్‌ నిర్మాణానికి మార్కింగ్‌లు ఇవ్వడంతో గురువారం వివాదం మరింత రచ్చ కెక్కింది.

ఆర్టీసీ వర్సెస్‌ పంచాయతీ
ఆర్టీసీ, పంచాయతీ అధికారుల వాగ్వావాదం

స్థలం కోసం వాదులాట

పోటాపోటీగా మార్కింగ్‌లు


కణేకల్లు, జూన 24 : స్థానికంగా ఆర్టీసీ, పంచాయతీ అధికారుల మధ్య స్థల వి వాదం తీవ్ర రూపం దాల్చింది. ఒకే స్థలానికి సంబంధించి ఇరుశాఖల అధికారులు కాంప్లెక్స్‌ నిర్మాణానికి మార్కింగ్‌లు ఇవ్వడంతో గురువారం వివాదం మరింత రచ్చ కెక్కింది. ఇరుశాఖల అధికారులు వివాదాస్పద స్థలం వద్దే వాగ్వాదానికి దిగారు. ఈ స్థలం తమదంటే తమదంటూ పట్టుబట్టారు. పోటాపోటీగా కాంప్లెక్స్‌ నిర్మాణానికి ఆ ర్టీసీ అధికారులు మార్కింగ్‌ ఇవ్వగా... ఈ స్థలం తమదేనంటూ పంచాయతీ అధికా రులు గీతగీశారు. వివరాల్లోకెళితే... 1999లో ఆర్టీసీ బస్టాండు కోసం అప్పట్లో రెవెన్యూ అధికారులు స్థలాన్ని కేటాయించారు. సదరు స్థలం ముందు పది అడుగుల మేర త మకు వస్తుందంటూ పంచాయతీ అధికారులు కూడా పేర్కొంటున్నారు. దీంతో ఎన్నో సంవత్సరాలుగా ఇరుశాఖల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో వాగ్వివాదం నడుస్తోంది. పట్టణానికి నడిబొడ్డున ఉన్న స్థలం కావడంతో ఇ క్కడ కాంప్లెక్స్‌ నిర్మాణాలు చేస్తే ఆదాయం బాగుంటుందని ఇ రుశాఖలు భావిస్తున్నారు. దీంతో స్థలాన్ని వదులుకోవడానికి ఏ శాఖ అధికారులూ సిద్ధంగా లేకుండా పోతున్నారు. ఈ పరిస్థితుల్లో గురువారం ఆర్టీసీ డీఎం సురే్‌షబాబుతో పాటు ఆ శా ఖ మిగతా అధికారులు ఆర్టీసీ బస్టాండు ఆవరణలో కాంప్లెక్స్‌ నిర్మాణానికి తమకు ఇంతవరకు స్థలం వస్తుందంటూ మా ర్కింగ్‌ ఇచ్చుకున్నారు.


ఈ విషయాన్ని తెలుసుకున్న పంచాయ తీ ఈవో చంద్రశేఖర్‌, సర్పంచ భర్త సోమన్న, వైస్‌సర్పంచ న బీసాబ్‌తో పాటు వార్డు సభ్యులంతా అక్కడకు చేరుకున్నారు. పంచాయతీకి కూడా ఇక్కడ వరకు స్థలం వస్తుందంటూ మరో మార్కింగ్‌ ఇచ్చుకున్నారు. దీంతో ఇరుశాఖల అధికారులు సం ఘటనా స్థలంలోనే వాగ్వివాదానికి దిగారు. స్థలం మాదంటే మాదంటూ ఒకరికొకరు తీవ్రస్థాయిలో వాదులాడుకున్నారు. విషయాన్ని తెలుసుకున్న ఎస్‌ఐ దిలీ్‌పకుమార్‌ వెంటనే సంఘట నా స్థలానికి చేరుకుని ఇరుశాఖల అధికారులకు సర్దిచెప్పారు. సమస్య ఏదైనా వుంటే కూర్చుని సామరస్యంగా మాట్లాడుకోవాలని, ఇలా వాగ్వివాదానికి దిగడం సరికాదన్నారు. అనంతరం ఆర్టీసీ అధికారులు తహసీల్దార్‌ ఉషారాణి వద్దకు వెళ్లారు. త మకు 1999లో కేటాయించిన స్థలాన్ని చూపాలని, తమను అ డ్డుకుంటున్న పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఆర్టీసీ బస్సుల సౌకర్యం కోసం అప్పట్లో స్థలం కే టాయించడం జరిగిందని, ఇప్పుడు తమకు వచ్చే స్థలాన్ని త మకు కేటాయిస్తే అక్కడ కాంప్లెక్స్‌ నిర్మాణం చేసి పంచాయతీ ఆదాయాన్ని పెంచుకుని పంచాయతీని అభివృద్ధి చేసేందుకు అవకాశం వుంటుందని పాలకవర్గ సభ్యులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వద్దకు తీసుకెళ్లగా శుక్రవారం సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. 




Updated Date - 2021-06-25T06:51:40+05:30 IST