అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న శరత్‌బాబు, దేవపాల్, అబ్రహాం తదితరులు
గుంటూరు, జనవరి 17: ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడుగా ఇటీవల ఆర్టీసీ గుంటూరు రీజనల్ డిప్యూటీ సీఎంఈగా పదవీ విరమణ చేసిన గోకనకొండ శరత్‌బాబు ఎన్నికయ్యారు. ఈ మేరకు కొత్తపేటలోని మేడ్ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన్ను ఉద్యోగులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శరత్‌బాబు మాట్లాడుతూ ఉద్యోగులు సమష్టిగా ఉంటేనే సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. మోడల్ అసోసియేషన్ ఆఫ్ దళిత ఎంప్లాయిస్ (మేడ్) రాష్ట్ర అధ్యక్షుడు మురికిపూడి దేవపాల్, ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.అబ్రహాం, కార్యవర్గ సభ్యులు రవికుమార్, కిరణ్‌కుమార్, రాజారావు తదితరులున్నారు.