Abn logo
Mar 7 2021 @ 22:18PM

ఆర్టీసీ జోనల్‌ కళాశాల అభివృద్ధికి చర్యలు

ఆర్టీసీ జోనల్‌ కళాశాల ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న ఆర్టీసీ ఎండీ ఆర్‌పీ ఠాకూర్‌

మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌పీ ఠాకూర్‌ 

వెంకటాచలం, మార్చి 7: ఆర్టీసీ జోనల్‌ కళాశాల ప్రాంగణాన్ని అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఏపీఎస్‌ ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌పీ ఠాకూర్‌ సూచించారు. మండలంలోని గొలగమూడి క్రాస్‌ రోడ్డు సమీపంలో జాతీయ రహదారికి అనుకుని ఉన్న ఆర్టీసీ జోనల్‌ కళాశాలను ఆదివారం ఆయన సందర్శించారు. కళాశాలను పరిశీలించిన ఆయన అధికారులతో సమీక్షించారు. అధికారులకు పలు సూచనలు, సలహాలిచ్చారు. ఈసందర్భంగా ఆర్టీసీ జోనల్‌ కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాట్టారు. ఆయన వెంట ఆర్టీసీ ఈడీవో కే బ్రహ్మానందరెడ్డి, నెల్లూరు జోనల్‌ ఈడీ జితేందర్‌రెడ్డి, నెల్లూరు ఆర్‌ఎం పీ వెంకటశేషయ్య, పలువురు ఆర్టీసీ అధికారులు ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement