అనునాయులకు డ్యూటీలు

ABN , First Publish Date - 2020-10-21T05:42:40+05:30 IST

మంచిర్యాల ఆర్టీసీ డిపో లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కార్మికులకు కేటాయించే ఓడీ (అవుట్‌ ఆఫ్‌ డ్యూటీ)ల లో అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణ లున్నాయి

అనునాయులకు డ్యూటీలు

ఆర్టీసీ ఓడీలలో వెలుగు చూస్తున్న అక్రమాలు

పైసలు, పైరవీలు ఉంటేనే నియామకం

సీనియారిటీని లెక్కలోకి తీసుకోని అధికారులు

సమాచారం బయటకు చెప్పే వారిపై వేధింపులు

మంచిర్యాల డిపోలో అధికారుల ఇష్టారాజ్యం


మంచిర్యాల, అక్టోబరు 20: మంచిర్యాల ఆర్టీసీ డిపో లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కార్మికులకు కేటాయించే ఓడీ (అవుట్‌ ఆఫ్‌ డ్యూటీ)ల లో అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణ లున్నాయి. సీనియారిటీని గాలికి వదిలేస్తూ అనునా యులు, నజరానాలు ఇచ్చే వారికి డ్యూటీలు కేటాయి స్తున్నట్లు పలువురు కార్మికులు ఆరోపిస్తున్నారు. డిపో లో 91 ఆర్టీసీ, 50 ప్రైవేటు బస్సులు ఉండగా 203 మంది డ్రైవర్లు, 245 మంది కండక్టర్లు పని చేస్తున్నా రు. కరోనా లాక్‌డౌన్‌ తరువాత మే 19 నుంచి బస్సు లు ప్రారంభమైనప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో నడవ డం లేదు. దీంతో కార్మికులందరికీ పూర్తిస్థాయిలో డ్యూటీలు లభించడంలేదు. దీంతో ఇతర విభాగాల్లో అవుట్‌ డ్యూటీ కింద అధికారులు తన అనునాయు లకు డ్యూటీ వేస్తుండగా, మరికొందరికి ఓడీల పేరుతో ఫ్రీ మస్టర్లు వేస్తున్నారు. అధికారుల వైఖరితో ఇబ్బం దులు పడుతున్న ఇతర కార్మికులు ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, విచారణ జరిపించాలని కోరుతున్నారు. 


నిబంధనలకు విరుద్ధంగా

ఓడీలు కేటాయించేటప్పుడు కార్మికుల సీనియారిటీ, మెడికల్‌ గ్రౌండ్‌ పరిశీలించాలని ఆర్టీసీ మేనేజ్‌మెంట్‌ నుంచి ఆదేశాలు ఉన్నా డిపోలో అవి అమలు కావ డం లేదు. కారోనా లాక్‌డౌన్‌ సమయంలో కొందరు కార్మికులకు బస్‌పాస్‌ కౌంటర్ల వద్ద ఓడీలు ఇచ్చారు. అయితే ప్రస్తుతం బస్సులు పూర్తిస్థాయిలో నడుస్తున్న ప్పటికీ కొందరు అదే ఓడీల్లో కొనసాగుతున్నారు. బస్సులు నడవని సమయంలో బస్‌పాస్‌ కౌంటర్ల వద్ద ఏం పని ఉంటుందో అధికారులకే తెలియాలి. ఓడీల కోసం తమను ఆశ్రయించే వారినుంచి రూ.18వేలు తీసుకొని డ్యూటీలు కేటాయిస్తున్నట్లు పలువురు కార్మి కులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం బస్‌పాస్‌ కౌంటర్ల వద్ద పెద్దగా పనిలేకపోవడంతో ఓడీల్లో ఉన్న కొందరు బయట తమ సొంత పనులు చేసుకుంటూ వేతనాలు పొందుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఓడీలు చేస్తున్న వారిలో ఒకరు మెడికల్‌ షాపు నిర్వహిస్తుండగా, మరో ఇద్దరు ఫైనాన్సులు నడుపుకుంటున్నారు. ఇంకో ఇద్దరు ఇన్సూరెన్స్‌ బిజినెస్‌లో బిజీగా ఉన్నారు. వీరంతా డ్యూటీలకు హాజరుకాకున్నా మస్టర్లు పడుతుండటం గమనార్హం. ఈ విషయమై కొందరు ఎంప్లాయి యూ నియన్‌ నాయకులు ట్రాన్స్‌పోర్టు మంత్రితోపాటు ఉన్న తాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుసుకున్న డిపో అధికారులు సెప్టెంబరు 1 నుంచి 10 వరకు హడావు డిగా రిజిస్టర్‌లో సంతకాలు పెట్టించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కార్గో సర్వీసుల్లోనూ పలువురికి నిబం ధనలకు వ్యతిరేకంగా ఓడీలు ఇచ్చారు. 


కార్మికులపై కక్ష సాధింపులు...

అధికారుల తప్పిదాన్ని ప్రశ్నిస్తున్న కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తప్పును వేలెత్తి చూపే వారిపై డిపో అధికారులు డ్యూటీలు ఇవ్వకపోవడం, సెలవులు మం జూరు చేయకపోవడం, అధిక పనిభారం మోపడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు  కార్మికులు వాపో తున్నారు. డిపోలో చాలాకాలంగా పాతుకుపోయిన ఓ అఽధికారి తన ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఇబ్బందుల కు గురి చేస్తున్నారని కార్మికులు తమ గోడు వెళ్లబోసు కుంటున్నారు. అధికారులు తన అనునాయులతో గ్యాం గులు ఏర్పాటు చేసుకుంటూ మిగతా వారిని ఇబ్బందు లకు గురి చేస్తున్నట్లు కార్మికులు ఆరోపిస్తున్నారు. ఓడీల కేటాయింపుల్లో జరిగిన అవినీతిపై వివరణ కోరేందుకు డిపో మేనేజర్‌ మల్లేశయ్యను ఫోన్‌లో సం ప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందు బాటులోకి రాలేదు. 


ఉన్నతాధికారుల విచారణ

మంచిర్యాల డిపోలో జరుగుతున్న అవినీతి తతం గంపై సమాచారం అందుకున్న ఆర్టీసీ డివిజనల్‌ మేనే జర్‌ రమేష్‌, ఆదిలాబాద్‌ సీఐ అమృతతోపాటు ఏఓ, పీఓలు నాలుగు రోజులుగా డిపోలో విచారణ జరుపు తున్నారు. ఓడీల కేటాయింపుల్లో డిపో మేనేజర్‌ మల్లే శయ్యతోపాటు ట్రాఫిక్‌ సెక్షన్‌ అధికారులను వివరాలు అడుగుతున్నట్లు తెలిసింది. గతంలో సైతం పల్లెవెలు గు బస్సులు, ఇతర సందర్భాల్లోనూ విచారణ జరిపిన అధికారులు కార్మికులనే బాధ్యులను చేస్తూ చర్యలు చేపట్టారని, ప్రస్తుతం చేపడుతున్న విచారణ సక్రమం గా జరపాలని, వాస్తవాలు వెలుగులోకి తేవాలని కార్మికులు కోరుతున్నారు. 

Updated Date - 2020-10-21T05:42:40+05:30 IST