బస్సుల్లో పెరిగిన మహిళల ప్రయాణం

ABN , First Publish Date - 2022-06-08T16:10:05+05:30 IST

ప్రభుత్వ రవాణా సంస్థల బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళల సంఖ్య 61 శాతం పెరిగిందని ఆ శాఖ మంత్రి శివశంకర్‌ తెలిపారు. సచివాలయంలో

బస్సుల్లో పెరిగిన మహిళల ప్రయాణం

                              - మంత్రి శివశంకర్‌


ప్యారీస్‌(చెన్నై), జూన్‌ 7: ప్రభుత్వ రవాణా సంస్థల బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళల సంఖ్య 61 శాతం పెరిగిందని ఆ శాఖ మంత్రి శివశంకర్‌ తెలిపారు. సచివాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 9 మండలాల్లో ప్రభుత్వ రవాణా సంస్థలు 22 వేలకు పైగా బస్సులు నడుపుతున్నాయని, అయితే ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ తదితర రాష్ట్రాల్లో 4 వేలకు పైగా బస్సులు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ బస్సుల్లో 40 శాతం మంది మహిళలు మాత్రమే ప్రయాణించేవారని, మహిళల ఉచిత ప్రయాణ పథకాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌ పరిచయం చేసిన అనంతరం ఆర్డినరీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య 61 శాతం పెరిగిందన్నారు. ఇంధనం ధరలు పెంచినందు వల్ల ప్రభుత్వ రవాణా సంస్థలపై రూ.42,500 కోట్ల రుణభారం పెరిగిందని, అయినప్పటికీ మహిళలు, విద్యార్థుల సంక్షేమార్ధం ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం విజయవంతంగా కొనసాగిస్తోందని మంత్రి తెలిపారు.

Updated Date - 2022-06-08T16:10:05+05:30 IST