నేటి నుంచి ఆర్టీఏ కార్యకలాపాలు

ABN , First Publish Date - 2020-06-01T10:02:46+05:30 IST

లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా సోమవారం నుంచి ఆర్టీఏ కార్యకలాపాలు యథావిధంగా

నేటి నుంచి ఆర్టీఏ కార్యకలాపాలు

అనంతపురం వ్యవసాయం మే 31 : లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా సోమవారం నుంచి ఆర్టీఏ కార్యకలాపాలు యథావిధంగా నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని రకాల ఆన్‌లైన్‌ సేవలు మొదలు పెట్టనున్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్షల కోసం అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. అనంతపురంతో పాటు తాడిపత్రి, హిందూపురం, గుంతకల్లు, కదిరి పట్టణాల్లోని కార్యాలయాల్లో వాహనదారులు భౌతికదూరం పాటించేలా కుర్చీలు ఏర్పాటు చేశారు.


ఎండ తీవ్రత దృష్టా అన్ని రకాల పరీక్షలు ఉదయం 9 గంటల నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు. లాక్‌డౌన్‌కు ముందు డ్రై వింగ్‌ లైసెన్స్‌, ఎల్‌ఎల్‌ఆర్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకున్న వాహనదారులు తిరిగి స్టాట్‌లో తేదీని ఎంచుకోవాలని డీటీసీ శివరాంప్రసాద్‌ సూచించారు. స్టాట్లల్లో ప్రతి రోజూ మూడోవంతు అభ్యర్థులకు మా త్రమే పరీక్షలు నిర్వహిస్తామన్నారు. దరఖాస్తుదారులను మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తామన్నారు. ఎఫ్‌సీ, ఇతర తనిఖీల కోసం వచ్చే వాహనాల్లో డ్రైవర్‌ను మాత్రమే అనుమతిస్తామన్నారు. తప్పనిసరిగా మాస్క్‌లు ధరించి, భౌతికదూరం పాటించాలన్నారు. 

Updated Date - 2020-06-01T10:02:46+05:30 IST