శంషాబాద్‌లో ఆర్టీఏ అధికారుల స్పెషల్ డ్రైవ్.. 12 వాహనాల సీజ్

ABN , First Publish Date - 2021-12-02T01:16:37+05:30 IST

శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో ఆర్టీఏ అధికారులు విస్తృతంగా వాహనాలు తనిఖీ చేసి అనుమతి పత్రాలు సరిగా లేని 12 వాహనాలను ...

శంషాబాద్‌లో ఆర్టీఏ అధికారుల స్పెషల్ డ్రైవ్.. 12 వాహనాల సీజ్

రంగారెడ్డి: శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో ఆర్టీఏ అధికారులు విస్తృతంగా వాహనాలు తనిఖీ చేసి అనుమతి పత్రాలు సరిగా లేని 12 వాహనాలను సీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు అత్తాపూర్ ఆర్టీఏ అధికారి రాధిక ఆధ్వర్యంలో శంషాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపట్టారు ఈ స్పెషల్ డ్రైవ్‌లో మొత్తం 55 వాహనాలను తనిఖీ చేయగా అందులో 12 వాహనాలకు సంబంధించిన పత్రాలు సరిగా లేకపోవని గుర్తించారు.  దీంతో ఆ వాహనాలను సీజ్ చేశారు. ఆర్టీఏ అధికారి రాధిక మాట్లాడుతూ ప్రజలు వాహనాలు నడిపేటప్పుడు జాగురూకతతో వ్యవహరించాలని, ప్రతి ఒక్కరూ వాహనానికి సంబంధించిన పత్రాలను దగ్గర పెట్టుకోవాలని చెప్పారు. ప్రజల ప్రాణాలకు ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని సూచించారు. 


Updated Date - 2021-12-02T01:16:37+05:30 IST