Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీతారామశాస్త్రి మరణానికి సంతాపం తెలిపిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

హైదరాబాద్: సీతారామశాస్త్రి మరణానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంతాపం తెలిపింది. తెలంగాణ ప్రాంత సంఘచాలక్ బూర్ల దక్షిణామూర్తి పేరిట పత్రికా ప్రకటన విడుదలైంది. భారతీయ తాత్వికతనే ఊపిరిగా మూడున్నర దశాబ్దాల పాటు సాగిన సాహిత్య ఝరి పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రజల మనస్సులలో స్థానం పొందారని బూర్ల దక్షిణామూర్తి చెప్పారు. సీతారామశాస్త్రి రచయితగా, కవిగా, గాయకుడుగా సినీ, సాహితీ రంగాల్లో చెరగని ముద్ర వేశారని తెలిపారు. 2013వ సంవత్సరం భాగ్యనగర్ నిజాం కళాశాల ప్రాంగణంలో జరిగిన ‘ఘోష్ తరంగ్’ కార్యక్రమంలో సీతారామశాస్త్రి అతిథిగా పాల్గొన్నారని బూర్ల దక్షిణామూర్తి గుర్తు చేశారు. ఆయన మరణం సాహిత్య రంగంలో తీరని లోటన్నారు. సీతారామశాస్త్రి ఆత్మకు శాంతి, సద్గతులు కలగాలని పరమేశ్వరుడిని ప్రార్ధిస్తున్నామన్నారు. 

Advertisement
Advertisement