విరాళం అందజేస్తున్న దాత గౌతమ్‌రెడ్డి
సూళ్లూరుపేట, జనవరి 28 : సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి శుక్రవారం నెల్లూరుకు చెందిన బత్తెన గౌతమ్‌రెడ్డి రూ. 90,005 విరాళం అందజేశారు. ఆలయం వద్ద ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డికి ఆ సొమ్మును అందజేశారు. దేవదాయశాఖ సహాయ కమిషనర్ పోరెడ్డి శ్రీనివాసురెడ్డి, కార్యనిర్వాహణధికారి బి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.