Abn logo
Aug 3 2021 @ 23:21PM

రూ. 4226 కోట్ల రుణాల లక్ష్యంగా ప్రణాళిక

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎల్‌పీ.శర్మన్‌

- కలెక్టర్‌ ఎల్‌పీ.శర్మన్‌

నాగర్‌కర్నూల్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి  రూ.4226 కోట్ల రుణాలను వివిధ పథకాల ద్వారా బ్యాంకు ఖాతాదారులకు ఇచ్చేందుకు లక్ష్యంగా నిర్దే శించుకున్నట్లు కలెక్టర్‌ ఎల్‌పీ.శర్మన్‌ ప్రకటించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశంలో లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీకి కలెక్టర్‌ అధ్యక్షత వహించగా జడ్పీ చైర్‌పర్సన్‌ పద్మావతి, జడ్పీటీసీ సభ్యులు, నాబార్డు, ఆర్‌బీఐ అధికారులు జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో కొవిడ్‌ ప రిస్థితులు నెలకొన్నప్పటికీ బ్యాంకర్లు తమ బా ధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చాలని కొనియా డారు. అయితే వ్యవసాయ, వ్యాపార, నిరుద్యోగుల కు రుణాలు అందించడం వంటి రంగాల్లో నిర్దేశిం చుకున్న లక్ష్యాల మేరకు రుణాలు అందించలేక పోయామని పేర్కొన్నారు. వచ్చే ఈ ఆర్థిక సం వత్సరంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, బ్యాంక ర్లు అందరూ భాగస్వాములై నిర్దేశించుకున్న లక్ష్యా నికి ఆర్థికంగా సాధించి జిల్లాను అభివృద్ది పథంలో నడిపించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాలను జిల్లాలో అర్హులందరికీ చేరే విధంగా మండలాలు, బ్రాంచుల వారిగా లక్ష్యాలను నిర్దేశించి అన్ని బ్రాంచులు వాటికి ఇచ్చిన లక్ష్యాలను సాధించే విధంగా  మార్గ నిర్దేశం చేయాలని లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ను ఆదేశిం చారు. సమావేశంలో పాల్గొన్న జిల్లా పరిషత్‌ చైర్‌ప ర్సన్‌ పద్మావతి మాట్లాడుతూ  వచ్చిన ఖాతాదా రులపై విసుగ్గోకుండా వారు రుణం తీసుకోవడానికి అర్హుల కాదా, ఎందుకు ఇవ్వడం లేదో  విడమరిచి చెప్పాలని బ్యాంకర్లను కోరారు. వివిధ సంక్షేమ పథ కాల ద్వారా ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు, పిం ఛన్ల వంటివి బ్యాంకులో డబ్బు జమ అయిన వెం టనే రుణాల కోతలు విధించి లబ్ధిదారులకు అన్యా యం చేయొద్దని కోరారు.  నాబార్డు డీడీఎం నాగా ర్జున మాట్లాడుతూ వ్యవసాయ పరంగా ఎంతో అభివృద్ధి సాధించిన నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మౌలిక సదుపాయాలైన గోదాములు, ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు చాలా అవకాశం ఉందని ఇలాంటి వాటిని నెలకొల్పేందుకు ముందుకు వచ్చిన వారికి రుణాలు అందించాల్సిందిగా బ్కాంకర్లకు సూచించారు. ఆర్‌బీఐడీఎల్‌డీవో సాయిచరణ్‌ మాట్లాడుతూ మండల స్థాయిలో బీఎల్‌ఆర్‌సీ సమావేశాలను తర చుగా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ పథకాలను ప్రజాప్రతినిధుల ద్వారా లబ్ధిదారులకు అందేవిధం గా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకోవా లన్నారు.  సమావేశంలో కల్వకుర్తి, అచ్చంపేట జడ్పీటీసీసభ్యులు భరత్‌కుమార్‌,  మంతియనా యక్‌ బ్యాంకర్ల పనితీరుపై అసంతృప్తిని తెలియజేశారు.  సమావేశంలో బ్యాంకర్లు, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, పీడీడీఆర్‌డీఏ నర్సింగరావు,  జిల్లా అధికారులు, జడ్పీటీసీ సభ్యులు  పాల్గొన్నారు.