రూ.3 వేల కోట్ల ఆలయ ఆస్తుల స్వాధీనం

ABN , First Publish Date - 2022-07-21T16:09:26+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా 224 ఆలయాలకు సంబంధించి రూ.3 వేల కోట్ల ఆస్తులను ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు హిందూ దేవాదాయ శాఖ మంత్రి పీకే

రూ.3 వేల కోట్ల ఆలయ ఆస్తుల స్వాధీనం

                         - మంత్రి పీకే శేఖర్‌బాబు


పెరంబూర్‌(చెన్నై), జూలై 20: రాష్ట్రవ్యాప్తంగా 224 ఆలయాలకు సంబంధించి రూ.3 వేల కోట్ల ఆస్తులను ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు హిందూ దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు తెలిపారు. స్థానిక నుంగంబాక్కంలోని దేవాదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఉత్తర్వులతో ఆక్రమణలకు గురైన ఆలయ స్థలాలు స్వాధీనం చేసుకొనేందుకు చర్యలు చేపట్టామన్నారు. 2021 మే 7 నుంచి ఈ ఏడాది జూలై 15వ తేది వరకు 224 ఆలయాలకు సొంతమైన 1906.39 ఎకరాల భూములు, 497 గ్రౌండ్ల 1064 చ.అ స్థలాలు, 53 గ్రౌండ్ల 1867 చఅ భవనాలు మొత్తం రూ.3000.21 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకొని సంబంధిత ఆలయాలకు అప్పగించినట్లు మంత్రి తెలిపారు.

Updated Date - 2022-07-21T16:09:26+05:30 IST