‘చేయూత’కు రూ.283 కోట్లు

ABN , First Publish Date - 2021-06-23T05:18:31+05:30 IST

వైఎస్‌ఆర్‌ చేయూత పథకం కింద జిల్లాలోని 1,51,344 మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.283.77 కోట్లు మంగళవారం జమయ్యాయి. వెలగపూడి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం జగన్‌ ఈ ప్రక్రియను ప్రారంభించారు. జిల్లాలో మొదటి విడత గత ఆగస్టులో 1,56,035 మందికి రూ.292.55 కోట్లు జమయ్యాయి.

‘చేయూత’కు రూ.283 కోట్లు
చేయూత చెక్‌ను లబ్ధిదారులకు అందజేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే

జమ చేసిన సీఎం జగన్‌

కలెక్టరేట్‌, జూన్‌ 22: వైఎస్‌ఆర్‌ చేయూత పథకం కింద జిల్లాలోని 1,51,344 మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.283.77 కోట్లు మంగళవారం జమయ్యాయి. వెలగపూడి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం జగన్‌ ఈ ప్రక్రియను ప్రారంభించారు. జిల్లాలో మొదటి విడత గత ఆగస్టులో 1,56,035 మందికి రూ.292.55 కోట్లు జమయ్యాయి. 45 నుంచి 60 సంవత్సరాల మధ్య గల మహిళలకు చిరు వ్యాపారం కోసం ఈ డబ్బులు ఇస్తున్నారు. రెండో విడతలో డబ్బులు జమ చేసిన అనంతరం జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, కడుబండి శ్రీనివాసరావు, రాజన్నదొర, విజయనగరం కార్పొరేటర్‌ కోలగట్ల శ్రావణి,   జేసీలు కిషోర్‌కుమార్‌, వెంకటరావు, డీఆర్‌డీఏ, మోప్మా పీడీలు సుబ్బారావు, సుధాకరరావు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-06-23T05:18:31+05:30 IST