అభివృద్ధి పనులకు రూ.2కోట్ల నిధులు

ABN , First Publish Date - 2020-09-19T09:34:52+05:30 IST

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు తూంకుంట మున్సిపాలిటీలో రూ.2కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించామని

అభివృద్ధి పనులకు రూ.2కోట్ల నిధులు

మంత్రి చామకూర మల్లారెడ్డి 

తూంకుంట మున్సిపాలిటీలో కల్యాణలక్ష్మి చెక్కుల అందజేత 


శామీర్‌పేట రూరల్‌: పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు తూంకుంట మున్సిపాలిటీలో రూ.2కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించామని కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం తూంకుంట మున్సిపాలిటీలోని దేవరయాంజాల్‌, పోతాయిపల్లి, హకీంపేట గ్రామాల్లో చెత్త డంపింగ్‌యార్డులు, సామూహిక మరుగుదొడ్లు, సీసీ రోడ్లను తూంకుంట మున్సిపల్‌ చైర్మన్‌ కారింగుల రాజేశ్వర్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరుపేదల బిడ్డలకు పెద్దన్నగా నేను ఉన్నాని భరోసానిస్తున్నారని అన్నారు.


కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.లక్షా 16వేలు అందజేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తున్న ఆయనకు ప్రతిఒక్కరూ రుణపడి ఉంటారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న సీఎం కేసీఆర్‌ దేవుడని అన్నారు. అనంతరం మున్సిపల్‌ పరిధిలోని పలు గ్రామాల్లో 26కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ వాణివీరారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సునీతలక్ష్మి, కౌన్సిలర్‌లు ఉమాశ్రీనివాస్‌, హరిబాబు, రాజుయాదవ్‌, నర్సింగ్‌గౌడ్‌, లక్ష్మికృష్ణారెడ్డి, నర్సింగరావు, ఆంజనేయులు, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు  శ్రీనివా్‌సరెడ్డి, కమిషనర్‌ సురేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ సురేందర్‌ పాల్గొన్నారు. 


దోబిఘాట్‌ను నిర్మించాలని రజక మహిళల వినతి 

తమకు దోబిఘాట్‌ నిర్మించాలని తూంకుంట మున్సిపల్‌ పరిధిలోని పోతాయిపల్లిలో రజక మహిళలు మంత్రిని కలిసి కోరారు. అదేవిధంగా  బోర్‌బావి వసతి, షెడ్‌ను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన మంత్రి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. 

Updated Date - 2020-09-19T09:34:52+05:30 IST