దివ్యాంగులకు నెలకు రూ.10 వేలివ్వాలి

ABN , First Publish Date - 2020-10-19T09:16:09+05:30 IST

కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ప్రతి దివ్యాంగుడికి సీఎం ప్రత్యేకనిధి నుంచి నెలకు రూ.10వేల చొప్పున అందజేయాలని వీహెచ్‌పీ రాష్ట్ర నాయకుడు కాళ్ల జంగయ్య కోరారు

దివ్యాంగులకు నెలకు రూ.10 వేలివ్వాలి

వీహెచ్‌పీ రాష్ట్ర నాయకుడు కాళ్ల జంగయ్య


వికారాబాద్‌ : కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ప్రతి దివ్యాంగుడికి సీఎం ప్రత్యేకనిధి నుంచి నెలకు రూ.10వేల చొప్పున అందజేయాలని వీహెచ్‌పీ రాష్ట్ర నాయకుడు కాళ్ల జంగయ్య కోరారు. వికారాబాద్‌ మండలం పులుమద్ది, మాదారం, గేటువనంపల్లి, మమ్మదాన్‌పల్లి గ్రామాల్లో ఆదివారం పర్యటించి వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొవిడ్‌ కారణంగా గత 7 నెలల నుంచి ఉద్యోగాలు లేక, ఉపాధి కరువైన దివ్యాంగులను రుణాలు చెల్లించాలని ఐకేపీ సిబ్బంది జులుం ప్రదర్శిస్తున్నారని అన్నారు.


దివ్యాంగులు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని కోరారు. ఆయా డిమాండ్లపై ఈనెల 21 వరకు క్షేత్రస్థాయిలో పర్యటించి, 22న ఎమ్మెల్యేలకు వినతిపత్రాలను అందజేస్తామని తెలిపారు. నవంబర్‌ 1న మండల కేంద్రాలలో నిరసన దీక్షలు చేపడతామని వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్‌, జిల్లా నాయకులు రాజు, గౌసొద్దీన్‌, శ్యాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-19T09:16:09+05:30 IST