తాండూరు వైద్యుడి దాతృత్వం

ABN , First Publish Date - 2020-11-16T09:46:14+05:30 IST

వివిధ కారణాలతో మృతి చెందిన పేద కుటుంబాలకు తాండూరు పట్టణంలోని శ్రీబాలాజీ నర్సింగ్‌హోం అధినేత, ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ సంపత్‌కుమార్‌ రూ.5వేల చొప్పున అంత్యక్రియల నిమిత్తం ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుతున్నారు.

తాండూరు వైద్యుడి దాతృత్వం

 ఎవరు మృతి చెందినా రూ.5వేల ఆర్థికసాయం

 అంత్యక్రియల కోసం పేద కుటుంబాలకు నగదు అందజేత

 100 కుటుంబాలకు పైగా వితరణ చాటిన డా.సంపత్‌కుమార్


తాండూరు  : వివిధ కారణాలతో మృతి చెందిన పేద కుటుంబాలకు తాండూరు పట్టణంలోని శ్రీబాలాజీ నర్సింగ్‌హోం అధినేత, ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ సంపత్‌కుమార్‌ రూ.5వేల చొప్పున అంత్యక్రియల నిమిత్తం ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుతున్నారు. ఇటీవలి కాలంలో సుమారు వందకు పైగా మృతుల కుటుంబాలకు ఆయన తన అనుచరులు లేదా ఆ గ్రామస్థుల ద్వారా నగదును పంపించి వారికి అందజేస్తున్నారు. తాండూరు పట్టణంలోనే కాకుండా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో వితరణ చాటుకుంటుండటం విశేషం. ఈవారం రోజుల్లోనే తాండూరు మండలం చంద్రవంచ, చెంగోల్‌, అంతారం గ్రామంలో, బషీరాబాద్‌ మండలం కొర్విచెడ్‌ గ్రామంలో, పాత తాండూరు, తాండూరు వారం రోజుల్లో పది మందికి సుమారు రూ.50వేల వరకు ఆర్థికసాయం అందించారు.


రెండు నెలల క్రితం ఈ కార్యక్రమానికి శ్రీకారంచుట్టిన డాక్టర్‌ సంపత్‌కుమార్‌ను పలువురు అభినందిస్తున్నారు. కేవలం మానవత్వంతో ఆదుకోవాలని ఉద్దేశంతోనే ఈ ఆర్థిక సహాయం చేస్తున్నానని, ఇందులో ఎలాంటి రాజకీయాల ఆశించి కాదని తెలిపారు. ఇవే కాకుండా గతంలో ఆయన నిరుపేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం, కళాకారులకు ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా సహాయం చేశారు. 


ఒకేరోజు రెండు కుటుంబాలకు ఆర్థికసాయం

తాండూరు రూరల్‌/బషీరాబాద్‌ : బాలాజీ నర్సింగ్‌హోం అధినేత డాక్టర్‌ సంపత్‌కుమార్‌ ఆదివారం రెండు కుటుంబాలకు రూ.5వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు.  తాండూరు మండలం అంతారం గ్రామంలో మృతిచెందిన ఏడీఏ గోవిందయ్య కుటుంబానికి స్థానిక నాయకుల ద్వారా ఆర్థికసాయాన్ని అందజేశారు.  కార్యక్రమంలో ఎంపీటీసీ శాంతు, సర్పంచ్‌ రాములు, ఉపసర్పంచ్‌ జీవరత్నం, యువ నాయకులు సంజీవరావు, చంటియాదవ్‌, గ్రామ పెద్దలు లక్ష్మణ్‌, బాబర్‌, మహేష్‌, అంబరీష్‌ పాల్గొన్నారు. అదే విధంగా బషీరాబాద్‌ మండలం కొత్లాపూర్‌ గ్రామంలో మృతిచెందిన మాణిక్‌బాయి కుటుంబానికి డాక్టర్‌ సంపత్‌కుమార్‌ ఆదివారం రూ.5 వేల ఆర్థికసాయం అందజేశారు. డాక్టర్‌ పంపిన సాయాన్ని ఏఎంసీ డైరెక్టర్‌ సునీల్‌ప్రసాద్‌, మాజీ ఎంపీటీసీ నరే్‌షచౌహాన్‌, వీఆర్వో అనంతయ్య, భాస్కార్‌, మంగ్య, ప్రేమ్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-16T09:46:14+05:30 IST