సన్నరకం ధాన్యం కొనుగోళ్లకు బ్రేక్‌

ABN , First Publish Date - 2020-11-13T09:11:41+05:30 IST

షాద్‌నగర్‌ డివిజన్‌లో మద్దతు ధరపై వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయితే సన్నరకం ధాన్యం కొనుగోలుకు బ్రేక్‌ పడింది.

సన్నరకం ధాన్యం కొనుగోళ్లకు బ్రేక్‌


షాద్‌నగర్‌ అర్బన్‌: షాద్‌నగర్‌ డివిజన్‌లో మద్దతు ధరపై వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయితే సన్నరకం ధాన్యం కొనుగోలుకు బ్రేక్‌ పడింది. ధాన్యాన్ని షాద్‌నగర్‌, మేకగూడ, కొత్తపేట, కొందుర్గు, చేగూరు సింగిల్‌ విండోలతో పాటు మె ప్మా మహిళా సంఘం ఆధ్వర్యంలో కొనుగోళ్లు ప్రారంభించారు. షాద్‌నగర్‌లో షాద్‌నగర్‌, చేగూరు సింగిల్‌ విండోలు కలిసి వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాయి. కొత్తపేట, మేకగూ డ, కొందుర్గులలో సింగిల్‌ విండోలు మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాయి. చేగూరులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సింగిల్‌ విండో ఏర్పాటు చేసింది. షాద్‌నగర్‌ కేంద్రంగా ఉన్న మెప్మా మహిళా సంఘం కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. మొగిలిగిద్దలో వరి కొనుగోలు కేం ద్రం ప్రారంభమైంది. వెలిజర్ల, చించోడ్‌, బూర్గుల, మధురాపురం గ్రా మాల్లోనూ వరి ధాన్యాన్ని కొననున్నారు. సింగిల్‌ విండోలు, మెప్మాలు కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని సివిల్‌ సప్లయీస్‌ శాఖ సూచించిన రైస్‌ మిల్లుకు పంపిస్తాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం వరి ఎ-గ్రేడ్‌ రకం ధాన్యాన్ని క్వింటాలుకు 1,888 రూపాయలకు, సాధారణ రకాలను 1868 రూపాయలకు, మొక్కజొన్న క్వి ంటాలుకు 1,850 రూపాయలకు కొనుగోలు చేయాలి.


వరిలో 17శా తం లోపు, మొక్కజొన్నలో 12శాతంలోపు తేమ ఉండాలి. కొనుగోలు కేంద్రాలకు వరి, మొక్కజొన్నను తేచ్చే రైతులు విధిగా వారి ఏఈవోల నుంచి ధ్రువీకరణ పత్రంతో పాటు వారిచ్చే టోకెన్‌ను తీసుకురావాలి. టోకెన్లతో పాటు రైతులు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంక్‌ పాస్‌ బుక్‌ జిరాక్స్‌ కాపీలను విధిగా తీసుకురావాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. కొనుగోలు చేసిన ధాన్యం, మొక్కజొన్న ఆయా గోడౌన్లకు చేరిన ఒకటి, రెండు రోజుల్లో రైతు బ్యాంక్‌ అకౌంట్‌లో డబ్బులు జమ అవుతాయని కొనుగోలు అధికారులు చెబుతున్నారు. 


సన్న రకం వడ్ల కొనుగోళ్లు ఎప్పుడు?

మద్దతు ధరపై ధాన్యం సన్నరకాల కొనడం లేదు. వరి సన్నరకా ల ధాన్యాన్ని ఇప్పుడే తేవద్దని కొనుగోలు అధికారులు చెబుతున్నారు. దొడ్డు రకాలను మాత్రమే తేవాలని కోరుతున్నారు. ప్రభుత్వ సూచనల మేరకు రైతులు అత్యధికంగా సన్న రకాలను సాగుచేశారు. భారీ వర్షాల వల్ల సన్నరకం పైర్లు దోమకాటుకు గురయ్యాయి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఒప్పందం కుదుర్చుకున్న రైస్‌ మిల్లర్లకు ఇస్తే వారు ప్రతి క్వింటాలు వడ్లకు 67కిలోల బియ్యం సివిల్‌ సప్లయ్‌కు ఇవ్వాలి. దొడ్డు రకాల్లో 67కిలోల బియ్యం ఇవ్వడానికి సాధ్యమవుతు ందని, సన్నరకాల్లో దోమ కాటు వల్ల 52 నుంచి 55కిలోలకు మించి బియ్యం రావడం లేదని రైస్‌ మిల్లర్లు చెబుతున్నారు. సన్న రకాల్లో ఎన్ని బియ్యం ఇవ్వాలో సివిల్‌ సప్లయ్‌ శాఖతో ఒప్పందం కుదిరిన తరువాతనే సన్నరకం వడ్లను ఆడించేందుకు తీసుకుంటామని మిల్ల ర్లు చెబుతున్నారు. సన్న రకాల కొనుగోలుపై ప్రభుత్వం సరైన నిర్ణయాన్ని త్వరగా తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2020-11-13T09:11:41+05:30 IST