ఐదుగురు రౌడీషీటర్లపై వేటు

ABN , First Publish Date - 2022-06-26T05:48:11+05:30 IST

ఐదుగురు రౌడీషీటర్లపై వేటు

ఐదుగురు రౌడీషీటర్లపై వేటు

ఆరు నెలలపాటు నగర బహిష్కరణ

విజయవాడ, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి) : విజయవాడ నుంచి ఐదుగురు కరుడుగట్టిన నేరగాళ్లపై పోలీసులు వేటు వేశారు. వారిని ఆరు నెలల పాటు నగరం నుంచి బహిష్కరించారు. దీనికి సంబంధించి పోలీస్‌ కమిషనర్‌ టి.కాంతిరాణా శనివారం ఆదేశాలు జారీ చేశారు. బెవర శ్రీను అలియాస్‌ పిళ్లా శ్రీను, మాచర్ల బాలాస్వామి అలియాస్‌ పండు, బానవతు శ్రీనునాయక్‌, మల్లవరపు విజయ్‌కుమార్‌ అలియాస్‌ ముసలం, కట్ల కాళీలను ఎన్టీఆర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ నుంచి బహిష్కరించారు. పిళ్లా శ్రీనుపై వన్‌టౌన్‌, పండుపై మాచవరం, శ్రీను నాయక్‌పై పటమట పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్లు ఉన్నాయి. ముసలం, కాళీలపై అజిత్‌సింగ్‌నగర్‌ పీఎస్‌లో షీట్లు ఉన్నాయి.  వీరంతా పలు కేసుల్లో జైలుకు వెళ్లొచ్చినా తీరు మాత్రం మార్చుకోలేదు. దీంతో నగరం నుంచి బహిష్కరించారు. లోగడ సత్యనారాయణపురం పీఎస్‌లో రౌడీషీట్‌ ఉన్న తుమ్మల మనోజ్‌ అలియాస్‌ మన, నున్న పీఎస్‌లో రౌడీషీట్‌ ఉన్న మట్టపర్తి దుర్గాప్రసాద్‌ అలియాస్‌ కోతల శివ నగర బహిష్కరణలో ఉన్నారు. తాజాగా వేటు పడిన వారితో కలిసి మొత్తం ఏడుగురు రౌడీషీటర్లపై నగర బహిష్కరణ విధించారు.


Updated Date - 2022-06-26T05:48:11+05:30 IST