రౌడీషీటర్‌ డేవిడ్‌రాజుకు రిమాండ్‌

ABN , First Publish Date - 2020-10-24T10:20:19+05:30 IST

పలు హత్య కేసుల్లో నిందితుడు, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న రౌడీషీటర్‌ పాలడుగు డేవిడ్‌ రాజు అలియాస్‌ రాజును ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు

రౌడీషీటర్‌ డేవిడ్‌రాజుకు రిమాండ్‌

అమీర్‌పేట, అక్టోబర్‌ 23 (ఆంద్రజ్యోతి): పలు హత్య కేసుల్లో నిందితుడు, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న రౌడీషీటర్‌ పాలడుగు డేవిడ్‌ రాజు అలియాస్‌ రాజును ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా, పామర్రు మండలం, జమీగొల్వేపల్లికి చెందిన డేవిడ్‌రాజు వెంగళరావునగర్‌లో ఉండేవాడు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అయిన అతడు పలువురిని భయభ్రాంతులకు గురిచేయడం, తన మాట వినని వారిని హత్యలు చేయించడంతో పాటు హత్యాయత్నం కూడా చేశాడు. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు. బెయిల్‌పై విడుదలైనా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. 2001లో ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు రౌడీషీట్‌ ఓపెన్‌ చేశారు. 2004 నుంచి కోర్టు వాయిదాలకు వెళ్లకుండా, పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నాడు. స్వగ్రామంలో ఉంటున్నాడన్న విషయమం తెలుసుకున్న పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2020-10-24T10:20:19+05:30 IST