ఉక్రెయిన్ నుంచి వస్తున్న భారతీయ విద్యార్థులకు రొమేనియా సహాయం

ABN , First Publish Date - 2022-02-26T13:35:19+05:30 IST

యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్ దేశం నుంచి తరలివస్తున్న భారతీయ విద్యార్థులకు రొమేనియా ప్రభుత్వం సహాయం అందించింది...

ఉక్రెయిన్ నుంచి వస్తున్న భారతీయ విద్యార్థులకు రొమేనియా సహాయం

 ఆహారం, వసతి కల్పించిన సర్కారు

న్యూఢిల్లీ : యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్ దేశం నుంచి తరలివస్తున్న భారతీయ విద్యార్థులకు రొమేనియా ప్రభుత్వం సహాయం అందించింది.ఉక్రెయిన్ నుంచి వస్తున్న భారత విద్యార్థులకు, శరణార్థులకు రొమేనియా ప్రభుత్వం ఆహారం, వసతి కల్పిస్తుందని ఢిల్లీలోని రొమేనియా దేశ రాయబారి డానియెలా సెజోనోవ్ చెప్పారు.భారత రాయబార అధికారులు విద్యార్థులను సరిహద్దులోని బుకారెస్ట్ కు చేరుకోవడానికి సహాయం అందిస్తున్నారు. బుకారెస్ట్ నుంచి విద్యార్థులను తరలించడానికి భారతదేశానికి విమానాలు నడుపుతున్నారు.ఉక్రెయిన్ దేశం నుంచి వస్తున్న శరణార్థులకు సహాయపడేందుకు రొమేనియా ప్రభుత్వం సంక్షోభ సెల్ ను ఏర్పాటు చేసింది.


తొలి బ్యాచ్‌ భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్‌ నుంచి సుసీవా సరిహద్దు మీదుగా రొమేనియా చేరుకున్నారు.సుసేవాలోని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ బృందాలు ఉక్రెయిన్ విద్యార్థులను భారతదేశానికి తరలించేందుకు బుకారెస్ట్‌కు విమానాలు ఏర్పాటు చేశారు.ఉక్రెయిన్ దేశంలో చిక్కుకున్న భారత పౌరులను స్వదేశానికి తరలించేందుకు భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ రొమేనియన్ తో పాటు యూరోపియన్ దేశాల విదేశాంగ శాఖ మంత్రులతో మాట్లాడారు.


Updated Date - 2022-02-26T13:35:19+05:30 IST