ఉక్రెయిన్‌కు సాయం చేస్తాం: రొమేనియా

ABN , First Publish Date - 2022-02-27T22:23:17+05:30 IST

రష్యా దాడితో వణికిపోతున్న ఉక్రెయిన్‌కు అన్ని రకాలుగా సాయం చేస్తామని రొమేనియా ప్రకటించింది. రొమేనియా, ఉక్రెయిన్ సరిహద్దులోనే ఉన్న దేశం.

ఉక్రెయిన్‌కు సాయం చేస్తాం: రొమేనియా

రష్యా దాడితో వణికిపోతున్న ఉక్రెయిన్‌కు అన్ని రకాలుగా సాయం చేస్తామని రొమేనియా ప్రకటించింది. రొమేనియా, ఉక్రెయిన్ సరిహద్దులోనే ఉన్న దేశం. ఇప్పటికే తమ దేశ సరిహద్దుకు చేరిన ఉక్రెయిన్ పౌరులకు రొమేనియా సాయం అందిస్తోంది. అయితే ఈ సాయాన్ని మరింతగా పెంచేందుకు రొమేనియా ముందుకొచ్చింది. ఉక్రెయిన్‌కు 3.3 మిలియన్ డాలర్ల విలువైన సహాయం అందిస్తామని చెప్పింది. తమ దేశం నుంచి మంచి నీళ్లు, చమురు, హెల్మెట్, మిలిటరీ సామగ్రి, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, ఆహారం వంటి సామగ్రిని అందజేస్తామని వెల్లడించింది. రష్యా దాడుల్లో గాయపడ్డ సైన్యానికి, పౌరులకు వైద్య సాయం కూడా చేస్తామని చెప్పింది. ప్రస్తుతం ఉక్రెయిన్-రొమేనియా సరిహద్దుల్లో రొమేనియా సేవలు అందిస్తోంది. సరిహద్దుకు చేరిన పిల్లలు, మహిళలకు సాయం అందిస్తోంది. 

Updated Date - 2022-02-27T22:23:17+05:30 IST