ఆదర్శప్రాయుడు నేతాజీ

ABN , First Publish Date - 2022-01-24T05:19:03+05:30 IST

నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ పనిలో నిబద్ధత, పట్టుదల, ధైర్యసాహసాలను ఆదర్శంగా తీసుకుని నేటి యువత ఉన్నత విద్యలో రాణించాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి మొక్కా జగన్నాథరావు అన్నారు.

ఆదర్శప్రాయుడు నేతాజీ
దివాన్‌చెరువు: బోస్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న వీసీ తదితరులు

  • నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి జగన్నాథరావు
  • ఘనంగా సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి
  • నివాళులర్పించిన నాయకులు, అధికారులు

దివాన్‌చెరువు, జనవరి 23: నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ పనిలో నిబద్ధత, పట్టుదల, ధైర్యసాహసాలను ఆదర్శంగా తీసుకుని నేటి యువత ఉన్నత విద్యలో రాణించాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి మొక్కా జగన్నాథరావు అన్నారు. సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిని జిల్లాలో పలుచోట్ల ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పలువురు అధికారులు, నాయకులు పూలమాలలతో నివాళులర్పించారు. నన్న య విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నేతాజీ చిత్రపటానికి వీసీ తది తరులు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బోస్‌ 21 ఏళ్లకే స్వాతంత్ర్యోద్యమంలో చేరారని, పోరాటంలో కీలక పాత్రను పోషించారని, నాటి ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని నింపారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య టి.అశోక్‌, ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటర్‌ ఎం.గోపాల కృష్ణ, ప్రభుత్వ ప్లీడర్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-24T05:19:03+05:30 IST