ఈమె మామూలు ముదురు కాదు.. పెళ్లి చేసుకుని భర్తకు నరకం చూపిస్తుంది.. ఆ తర్వాత..

ABN , First Publish Date - 2022-02-17T19:38:13+05:30 IST

కింది ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు కోమల్.. వయసు 24 సంవత్సరాలు..

ఈమె మామూలు ముదురు కాదు.. పెళ్లి చేసుకుని భర్తకు నరకం చూపిస్తుంది.. ఆ తర్వాత..

పై ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు కోమల్.. వయసు 24 సంవత్సరాలు.. చూడడానికి అమాయకంగా కనిపిస్తున్న ఈ మహిళ ఇప్పటికి మూడు పెళ్లిళ్లు చేసుకుంది.. ఇద్దరి నుంచి భారీగా డబ్బు వసూలు చేసింది.. మూడో భర్త నుంచి కూడా అలాగే వసూలు చేయాలనుకుంది.. అయితే అతను పోలీసులను ఆశ్రయించడంతో ఆమె బండారం బయటపడింది.


రాజస్థాన్‌లోని జైపూర్‌కు సమీపంలో జవహర్ నగర్‌కు చెందిన దీపక్ కుమార్ అనే వ్యక్తి 2017లో కోమల్ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. తాను అనాథనని చెప్పడంతో పెళ్లి ఖర్చంతా అతనే భరించాడు. కోమల్‌కు మూడు తులాల బంగారం కూడా ఇచ్చాడు. అయితే వివాహం జరిగిన నెల రోజుల తర్వాత కోమల్ పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పట్నుంచి దీపక్ ఇంటికి తిరిగి వెళ్లలేదు. అలాగని విడాకులు ఇచ్చేందుకు కూడా అంగీకరించడం లేదు. విడాకులు కావాలంటే తనకు రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. 


తనకు రూ.10 లక్షలు ఇవ్వకపోతే రివర్స్‌లో కట్నం వేధింపుల కేసు పెడతానని బెదిరించింది. దీంతో దీపక్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి షాకింగ్ విషయాలు బయటపెట్టారు. కోమల్‌కు గతంలో రెండుసార్లు వివాహాలు జరిగాయని తేల్చారు. ఆ ఇద్దరు భర్తల నుంచి కూడా ఇదే తరహాలో కోమల్ డబ్బులు వసూలు చేసిందని తెలుసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కాపురానికి వెళ్లకుండా, విడాకులు ఇవ్వకుండా ఏడిపించి, ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేసి వారితో తెగదెంపులు చేసుకుంది. ఆమెను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-02-17T19:38:13+05:30 IST