యథేచ్ఛగా చెట్ల నరికివేత

ABN , First Publish Date - 2022-06-05T05:38:46+05:30 IST

యథేచ్ఛగా చెట్ల నరికివేత

యథేచ్ఛగా చెట్ల నరికివేత
హైదరాబాద్‌-బీజాపూర్‌ రోడ్డుపై అజీజ్‌నగర్‌ చౌరస్తా వద్ద హోటల్‌ ఎదురుగా చెట్లను నరికి పాతిన బోర్డు

  • హోటల్‌ నిర్వాహకులు, దుకాణదారుల నిర్వాకం 
  • రోడ్డు పక్కన వృక్షాలకు మనుగడ కరువు
  • పట్టించుకోని పంచాయతీ అధికారులు

మొయినాబాద్‌ రూరల్‌, జూన్‌ 4: మొక్కలు నాటి వృక్షాలుగా అభివృద్ధి చేసి పచ్చదనాన్ని పెంపొందించాలని ప్రభుత్వం, ప్రైవేట్‌, స్వచ్ఛంద సంస్థలు ఓ వైపు శ్రమిస్తున్నా కొందరి వల్ల శ్రమంతా బూడిదలో పన్నీరులా అవుతోంది. నీళ్లు పోసి పెంచిన వృక్షాలను అడ్డంగా నరికేస్తున్నారు. రోడ్డు పక్కన చెట్లను వాణిజ్య సముదాయాల యజమానులు ఇష్టానుసారం తొలగిస్తున్నారు. వారికి స్థానిక ప్రజాప్రతినిధుల అండ ఉండడం గమనార్హం. హిమాయత్‌నగర్‌ పరిధి అజీజ్‌నగర్‌ చౌరస్తా హైదరాబాద్‌-బీజాపూర్‌ రహదారిపై పదుల సంఖ్యలో వాణిజ్య సముదాయాలున్నాయి. హోటళ్లకు అడ్డుగా ఉన్నాయని చెట్లను కొట్టేస్తున్నారు. దుకాణాల ఎదుట వృక్షాలన్నీ తొలగిస్తున్నారు. చెట్ల నరికివేత కన్పిస్తున్నా అధికారులు చర్య లు తీసుకోవడం లేదు. తాజా గా హిమాయత్‌నగర్‌ వద్ద ఓ హోటల్‌ నిర్మిస్తున్నారు. వాహనదారులకు హోటల్‌ కన్పించాలని చెట్లు కొట్టేసి హోటల్‌ బోర్డు ఏర్పాటు చేసుకున్నారు. చెట్లను నరికివేసిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదుచేయాలని పర్యావర ణ ప్రేమికులు, స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2022-06-05T05:38:46+05:30 IST