సీసీ రోడ్డు పనుల పరిశీలన

ABN , First Publish Date - 2022-05-25T05:41:56+05:30 IST

యర్నగూడెం-పోతవరం రోడ్డులో రూ.1.50 కోట్లతో నిర్మిస్తున్న సీసీ రోడ్డును ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మంగళవారం పరిశీలిం చారు.

సీసీ రోడ్డు పనుల పరిశీలన

దేవరపల్లి, మే 24: యర్నగూడెం-పోతవరం రోడ్డులో రూ.1.50 కోట్లతో నిర్మిస్తున్న సీసీ రోడ్డును ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మంగళవారం పరిశీలిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యర్నగూడెం రోడ్డు నుంచి ఫామాయిల్‌ ఫ్యాక్టరీ వరకు సీసీ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయని, నాణ్యతతో కూడిన రోడ్డును నిర్మిస్తామని అన్నారు. నియోజకవర్గంలో అవసరమైన చోట్ల సీసీ, తారురోడ్లు నిర్మాణం చేపట్టనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో యర్నగూడెం సర్పంచ్‌ బొంతా భరత్‌బాబు, ఆయిల్‌ ఫామ్‌ రాష్ట్ర డైరెక్టర్‌ నరహరశెట్టి రాజేంద్రబాబు, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ వినోద్‌కుమార్‌ పాలొన్నారు. 


Updated Date - 2022-05-25T05:41:56+05:30 IST