రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-05T04:52:27+05:30 IST

పాతపట్నంలో రోడ్డు విస్తరణ పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. 326ఎ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పట్టణంలో రోడ్డుకు ఇరువైపులా భవనాల తొలగింపు ప్రక్రియను చేపట్టారు.

రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం
రోడ్‌ విస్తరణ పనులను పరిశీలిస్తున్న తహసీల్దార్‌ తదితరులు

పాతపట్నం: పాతపట్నంలో రోడ్డు విస్తరణ పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి.  326ఎ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పట్టణంలో రోడ్డుకు ఇరువైపులా భవనాల తొలగింపు ప్రక్రియను చేపట్టారు. పనులను తహసీల్దార్‌ ఎం.కాళీప్రసాద్‌ పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా  సంక్రాంతి పండగ సమీపిస్తున్నందున రోడ్డు విస్తరణ వల్ల వ్యాపారాలు దెబ్బతినే అవకాశం ఉందని చిరువ్యాపారులు, దుకాణాలు కోల్పోయిన వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. సం క్రాంతి అనంతరం ఈ పనులు చేపడితే బాగుండేందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కార్యక్రమంలో మేజర్‌ పంచాయతీ ఈవో టి.హరికృష్ణ, వీఆర్వో బాలరాజు, పోలీసులు పాల్గొన్నారు. 

 

 

Updated Date - 2020-12-05T04:52:27+05:30 IST