రోడ్డు భద్రత మాసోత్సవాలను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-01-19T06:38:17+05:30 IST

జనవరి 18 నుంచి ఫిబ్రవరి 17 తేదీ వరకు నిర్వహించనున్న రోడ్డు భద్రత మాసోత్సవాలను విజయవంతం చేయాలని రవాణా శాఖ అధికారులను కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ ఆదేశిం చారు.

రోడ్డు భద్రత మాసోత్సవాలను విజయవంతం చేయాలి

ఆదిలాబాద్‌ అర్బన్‌, జనవరి 18: జనవరి 18 నుంచి ఫిబ్రవరి 17 తేదీ వరకు నిర్వహించనున్న రోడ్డు భద్రత మాసోత్సవాలను విజయవంతం చేయాలని రవాణా శాఖ అధికారులను కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ ఆదేశిం చారు. 32వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ తమ క్యాంపు కార్యాలయంలో రహదారి భద్రతకు సంబంధించిన బ్యానర్‌, స్టిక్కర్‌ను, రోడ్డు నిబంధనలు పొందుపర్చిన కరపత్రాలను విడుదల చేశారు. నెల రోజుల పాటు రోడ్డు భద్రత కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి.శ్రీనివాస్‌ ఎంవీఐ, రామారావు, భిక్షపతి, అభిలాష్‌, మహేష్‌, సురేష్‌, సాయి చరణ్‌, శ్రీకాంత్‌, మధు, ఏఎంవీఐలు పాల్గొన్నారు.

ఉట్నూర్‌రూరల్‌: సడక్‌ సురక్ష, జీవన్‌రక్ష అనే పద్ధతిని అవలంబిస్తు డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలను నడపాలని ఉట్నూర్‌ ఆర్టీసీ డిపో అధికారులు పేర్కొన్నారు. సోమవారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను సూపరింటెండెంట్‌ శకుంతల రాజన్న, టీఐటూ జనార్దన్‌ ప్రారంభించారు.  ఉత్సవాలను విజయవంతం చేయాల్సిన బాధ్యత ఆర్టీసీ డ్రైవర్లపై ఉందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితంగా భావిస్తు ప్రజలు తమ బస్సులలో ప్రయాణిస్తున్నందున వారికి ఎలాంటి హాని జరగకుండా గమ్యస్థానాలకు  చేర్చాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

ఆదిలాబాద్‌టౌన్‌: 32వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవంలో భాగంగా సోమవారం జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో ఆర్టీవో అధి కారులతో కలిసి రహదారి భద్రతకు సంబంధించిన వాల్‌ పోస్టర్లను ఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్‌ విడుదల చేశారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జనవరి 18 నుంచి ఫిబ్రవరి 17 వరకు పోలీసు, ఆర్టీవో, ఆర్టీసీ అధికారులు సంయుక్తంగా రోడ్డు భద్రత కార్యక్రమాలు చేపట్టాల న్నారు. ఇటీవల ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు హెల్మెట్‌ తప్పని సరి చేస్తూ నిబంధనలు అమలు చేస్తున్న నేపథ్యంలో పట్టణంలో మార్పు స్పష్టంగా కనబడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంవీఐ డి.శ్రీనివాస్‌, ఏఎంవీఐ రామారావ్‌, భిక్షపతి, అభిలాష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌ రూరల్‌: హెల్మెట్‌ లేకుండా నడుపుతున్న 34 ద్విచక్ర వాహనాలను సోమవారం రూరల్‌ సీఐ పురుషోత్తంచారి, ఎంవీఐ భిక్షపతి, రామారావ్‌ సీజ్‌ చేశారు. రూరల్‌ పోలీసు స్టేషన్‌ ఎదురుగా ఎంవీఐ, పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ పురుషోత్తంచారి మాట్లాడుతూ వాహనచోదకులు తప్పని సరిగా హెల్మెట్‌ ధరించాలని, ధ్రువపత్రాలు కలిగి ఉండాలన్నారు. హెల్మెట్‌ లేకుండా వాహనాలను నడుపవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-19T06:38:17+05:30 IST