ప్రయాణం.. ప్రాణసంకటం

ABN , First Publish Date - 2022-05-27T18:24:01+05:30 IST

బళ్లారి జిల్లా కంప్లి నియోజకవర్గ పరిధి బసరకోడు వద్ద గల వేదావతి నదిపై గూళ్యం గాదెలింగప్ప రథోత్సవం సందర్భంగా ఆ నది ఇరువైపులా ఉన్న గ్రామస్థులు

ప్రయాణం.. ప్రాణసంకటం

 కంప్లి(బెంగళూరు): బళ్లారి జిల్లా కంప్లి నియోజకవర్గ పరిధి బసరకోడు వద్ద గల వేదావతి నదిపై గూళ్యం గాదెలింగప్ప రథోత్సవం సందర్భంగా ఆ నది ఇరువైపులా ఉన్న గ్రామస్థులు ముందుకొచ్చి తాత్కాలిక వంతెన ఏర్పాటు చేశారు. కానీ రెండు రోజుల క్రితం భారీ వర్షాల కారణంగా ఆ తాత్కాలిక వంతెన మట్టి కొట్టుకుపోయింది. కేవలం పైపులు మాత్రమే మిగిలాయి. అయినా కర్ణాటక నుంచి ఆంధ్రలోని గూళ్యం వైపునకు, గూళ్యం నుంచి బసరకోడుకు వెళ్లేందుకు ప్రజలు ఈ పైపులపైనే వెళ్తున్నారు. దీంతో ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్థులు  ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఇరు రాష్ట్రాల పాలకులు స్పందించి.. వేదావతి నదిపై శాశ్వత వంతెన ఏర్పాటు చేయాలని కోరారు.

Updated Date - 2022-05-27T18:24:01+05:30 IST