Abn logo
Nov 21 2020 @ 13:35PM

ఘోర ప్రమాదం...ఏడుగురు సజీవదహనం

గుజరాత్‌: సురేంద్రనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన డంపర్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధం కాగా ఆ కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు సజీవదహనమైయ్యారు. చోటిలమాత దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సురేంద్రనగర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.